‘ఆఫ్ట్రాల్ తెలుగోళ్ళు’.. దెబ్బ గట్టిగా తగిలింది కదూ..!

‘ఆఫ్ట్రాల్ తెలుగోళ్ళు’.. దెబ్బ గట్టిగా తగిలింది కదూ..!!

చాలా, చాలా అంటే చాలా తక్కువగా అంచనా వేశారు డిల్లీ పెద్దలు. 29 రాష్ట్రాల కలయికతో ఏర్పడిన నా భారత దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పాలించాలి అన్న కపట నాటకాలకి అడ్డు కట్ట వేశారు ఆ ఆఫ్ట్రాల్ తెలుగోళ్ళు. తొలి నుంచి చెబుతూనే ఉన్నారు. డిల్లీ పెద్దలను పెద్దవాళ్ళుగా చేసిన ఆరెసెస్ కురువృద్దులు అయినటువంటి అద్వానీ, వాజ్‌పాయ్ కూడా ఎన్నో సార్లు హెచ్చరించారు. ఎవరిని కదిపినా కోలుకోగలం కానీ, తెలుగు వాళ్ళను కెలికితే మాత్రం మన గొయ్యి మనమే కొలతలు పెట్టి మరీ, ఎదురు డబ్బులు ఇచ్చి తవ్వించుకున్నట్లు అవుతుంది అని. వినలేదు, అస్సలు వినలేదు, గెలుపు మలుపులు అందలాన్ని ఎక్కించాయి.

ఆ పొగరుతో కూడుకున్న బలుపు కళ్ళను నెత్తికి ఎక్కెలా చేసింది. ఇంకేం ఉంది, సగం దేశాన్ని పాలిస్తున్న మేము, మిగిలిన దేశాన్ని మా గుప్పెట్లోకి తెచ్చుకోవడం చాలా సులభం అనుకున్నారు. రోబోలో రజని డైలాగ్ లాగా ‘జూజుబీ’ అన్నారు. గత ఎన్నికల్లో మిత్ర పక్షంగా ఏర్పడి ఆ తర్వాత నానా తిప్పలు పెట్టారు. ఉనికి చాటుకునే పరిస్థితి లేని కమలం పార్టీకి ఊపిరి పోసి 9 సీట్లు గెలిపిస్తే, ఒక ఎంపీ స్థానాన్ని ప్రతిపక్ష పార్టీ నాయకుడి తల్లిని ఎదిరించి మరీ పువ్వుల్లో పెట్టి ఇస్తే, చివరకు ఇచ్చిన హామీలు అన్నీ మరచి చేతిలో మట్టి పెట్టి, అదే మట్టి నోట్లో కొట్టి చెంబుడు నీళ్ళతో సరిపెట్టారు. అయితే కధ అక్కడితో అయిపోతే వాళ్ళు తెలుగువాళ్ళు ఎందుకు అవుతారు.

తప్పు చేశారు, చేస్తున్నారు, ఇంక వద్దు ఆపెయ్యండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటూ 29 సార్లు తెలుగు వారి ఇంటికి పెద్ద దిక్కులాంటి నేత డిల్లీ తలుపు తడితే చీకట్లో కూర్చుని ఆయన్ని పంపించేశారు. కట్టలు తెంచుకుంది కోపం, దెబ్బ తిన్నది ఆత్మగౌరవం, ఇబ్బందుల్లో పడింది తెలుగు వాడి అభిమానం, ఇప్పటివరకూ మా వాక్కులు విన్నారు, ఇక మీతో ‘వార్’ అంటూ కన్నడ నాట వేదికగా కన్నడ కుటుంభాలతో కలిసి కొట్టిన దెబ్బతో కళ్ళు బైర్లు కమ్మిపోయాయి కమలం పెద్దలకి. చివరి వరకూ వచ్చిన గెలుపు ఒక్కసారిగా పక్క శిబిరంలోకి దూకేసింది, అది తెలుగువాడు గీసిన రూట్ మ్యాప్పే, కాదనడానికి ఏమాత్రం సందేహం లేదు.

అయినా మారలేదు. మేమే ఆశాములం అన్నట్లుగా అదే ధోరణి ప్రదర్శించారు. కట్ చేస్తే నేడు బై ఎలెక్షన్స్లో ఎప్పుడూ ఓడి పోనీ బళ్ళారి కోట బద్దలై పోయింది. శివమోగ్గలో లక్షల్లో ఉండాల్సిన మెజారిటీ వేలకు పడిపోయి, వాడిపోయి విలవిల లాడింది. కంగారు ఏమీ లేదు నెత్తికెక్కిన కళ్ళు కిందకు దిగకపోతే రేపు తెలంగాణాలోను ఇదే తీర్పు ఉత్పన్నం అవుతుంది అందుల్లో సందేహం లేదు, ఇక ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో మీ పార్టీ వాళ్ళు ఎంత మంది పోటీకి సుముఖత చూపుతారో అన్న వద్దే లెక్కలు కట్టుకోక తప్పదు.

ఒకవేళ ధైర్యం చేసి బరిలో నిలిచినా ఏ ఏ నాయకుడు ఎంత లెక్కలో డిపాజిట్లు కోల్పోయాడో లెక్కపెట్టుకోవడమే తప్పా, డిపాజిట్లు రావడం కూడా కష్టమే. రాసి పెట్టుకోండి మోడి అండ్ షాలు దక్షిణాన్ని మీరు టచ్ చెయ్యాలి అంటే, ముందుకు మీకు తెలుగు వాడి దయ ఉండాలి. అప్పటివరకూ ఉత్తారాన్ని, ఈశాన్య రాష్ట్రాలను ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలో కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తూ ఉండండి..రేపు “సేవ్ నేషన్” సక్సెస్ అయితే మాత్రం నువ్వు ఏ “ఛాయ్ వాలా”ను అంటూ చెప్పుకు బ్రతుకుతున్నావో, చివరకు అదే ఛాయ్ దుకాణాన్ని నడుపుకోవడమే.

ఖబర్ధార్ మోడి…

ఇది తెలుగు వాళ్ల తరపున, ఒక తెలుగు వాడిగా మేము రాస్తున్న మాట.. ఇట్లు ఆంధ్రా వాలా!

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.