అదుగో మూవీ రివ్యూ

స‌మ‌ర్ప‌ణ‌: సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్
నిర్మాణ సంస్థ‌లు: సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్‌
తారాగ‌ణం: ర‌విబాబు, అభిషేక్ వ‌ర్మ‌, న‌భా, ఉద‌య్ భాస్క‌ర్, ఆర్‌.కె, వీరేంద‌ర్ చౌద‌రి త‌దిత‌రులు
సంగీతం: ప‌్ర‌శాంత్ ఆర్‌.విహార్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి
క‌థ‌: నారాయ‌ణ రెడ్డి
కూర్పు: బ‌ల్ల స‌త్యనారాయ‌ణ‌
మాట‌లు: ర‌విబాబు, నివాస్‌
క‌థ‌, నిర్మాత‌, ద‌ర్శక‌త్వం: ర‌విబాబు

నటుడిగా సినీ కెరీర్‌ను ప్రారంభించిన రవిబాబు అన్ని రకాల క్యారెక్టర్లలో మెప్పించాడు. అలాగే దర్శకుడిగా మారిన తర్వాత అన్ని రకాల జోనర్లను టచ్‌ చేసి ప్రేక్షకులకు మంచి మంచి సినిమాలను అందించాడు. లవ్, హర్రర్, థ్రిల్లర్, కామెడీ సినిమాలతో సందడి చేసిన రవిబాబు.. మరో కొత్త ప్రయోగం చేశాడు. అదే లైవ్ యానిమేష‌న్ టెక్నాల‌జీ. దీని సాయంతో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు చేసిన సినిమానే ‘అదుగో’. ఓ పంది పిల్లను ప్రధాన పాత్రధారిగా చూపిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్‌తో పాటు వైవిధ్యమైన ప్రచారంతో సినిమాపై అంచనాలు పెంచేశాడు. దీనికి తోడు ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ సమర్పించడం ఆసక్తిని రేకెత్తించింది. హీరోలతో మంచి సక్సెస్‌లు అందుకున్న రవిబాబు.. పందిపిల్లతో చేసిన ప్రయత్నంలో విజయం సాధించాడా..? లేదా..?

కథ
బంటి (పందిపిల్ల‌) త‌న తండ్రి చెప్పిన మాట‌ల్ని పెడచెవిన పెట్టి ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లిపోతుంది. దానిని ఓ వ్యక్తి బంటి అని పేరు పెట్టి పెంచుకుంటుంటాడు. అప్పుడు ఎవరో బంటిని కిడ్నాప్ చేస్తారు. అదే సమయంలో భూమి విష‌యంలో గొడ‌వ‌లున్న సిక్స్‌ప్యాక్ శ‌క్తి (రవిబాబు), దుర్గ అనే ఇద్ద‌రు ముఠాల చేతిలో చిక్కుకుంటుంది. అక్కడ ఓ పని చేసిన బంటిని ఈ ముఠాలు వెదుకుతుంటాయి. అదే సమయంలో ఒక తప్పుడు కొరియర్ ద్వారా హీరో (అభిషేక్ వర్మ) దగ్గరకి చేరుతుంది. కొరియర్‌లో ఉన్నది పంది పిల్ల అని తెలియక, అభిషేక్ వర్మ దాన్ని తన లవర్ నాభా నటేష్‌కి ప్రెజెంట్ చేస్తాడు. ఇలా హీరోహీరోయిన్లు కూడా ఆ ముఠాల బారిన పడతారు. వీళ్లతో పాటు మరో రెండు ముఠాలు కూడా బంటి కోసం వెదుకుతుంటాయి. ఇంతకీ ఈ ముఠాలు ఎవరివి..? మొదటి ముఠా దగ్గర బంటి చేసిన పనేంటి..? అసలు బంటి వాళ్లకు దొరికిందా.. లేదా..? ఈ ముఠాల మధ్యలో ప్రేమజంట ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
దర్శకడు రవిబాబు రెండున్నరేళ్లు కష్టపడి చేసిన ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా లేదు. బంటి సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన్నప్పటికీ.. కన్ఫ్యూజింగ్ కామెడీ చిరాకు తెప్పిస్తుంది. గ్యాంగ్‌లు నుంచి తప్పించుకునే సన్నివేశాల్లో.. రౌడీలతో ఫైట్ చేసే సన్నివేశాల్లో బంటి బాగానే అలరిచిన్నప్పటికీ.. అవి అంత నమ్మశక్యంగా అనిపించవు. కథ పరంగా కూడా ఇదే తరహా సినిమా ఈ మధ్యే బోలెడు వచ్చాయి. ఈ సినిమా చేస్తున్నంత సేపూ ఆసక్తికరంగా ఉండకపోగా బోర్ కొట్టిస్తుంది. కనీసం పిల్లలకు నచ్చడం కూడా డౌటే. మొత్తంగా రవిబాబు రెండున్నరేళ్ల కష్టం వృథా అనే చెప్పాలి.

నటీనటుల పనితీరు
ఈ సినిమాకు అన్నీ బంటి అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన బంటి సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్యాంగ్‌లు నుంచి తప్పించుకున్నే సన్నివేశాల్లో.. రౌడీలతో ఫైట్ చేసే సన్నివేశాల్లో బంటి బాగా అలరిస్తోంది. ఇక హీరోగా నటించిన అభిషేక్ వర్మ ఎలాంటి తడబాటు, బెఱుకు లేకుండా చాలా చక్కగా కాన్ఫిడెంట్‌గా నటించాడు. హీరోయిన్ నాభ నటేష్ తన నటనతో పాటు తన గ్లామర్‌తోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక సిక్స్ ప్యాక్ శక్తిగా నటించిన రవిబాబు తన కామెడీ టైమింగ్‌‌తో అక్కడక్కడా నవ్విస్తూనే.. ఇటు మర్డర్స్ చేస్తూ.. కథలో సీరియస్‌నెస్ తీసుకొచ్చారు. బంటిని పెంచుకునే పిల్లాడి పాత్రలో నటించిన అబ్బాయి కూడా చాలా బాగా నటించాడు. బంటి కోసం ఆ పిల్లాడు పడే బాధ.. ఆ పిల్లాడి కోసం బంటి పడే తపన కాస్త ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడంతో పాటు సినిమాకే హైలెట్‌గా నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

టెక్నీషియన్ల పనితీరు
దర్శకుడు రవిబాబు కొత్త ప్రయోగం చేసినా.. దాన్ని కరెక్ట్‌గా చూపించడంలో విఫలమయ్యాడు. అతడు రాసుకున్న స్క్రిప్ట్ గతంలో చాలా సార్లు చూసిన ప్రేక్షకులకు కొత్తదనం ఎక్కడా కనిపించదు. రవిబాబు పందిపిల్లను హైలైట్ చేస్తే చాలు అనుకున్నాడేమో అనిపిస్తుంది. సుధాకర్ రెడ్డి కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది. ప్రశాంత్ విహారి అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు. ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకి తగ్గట్లు సాగింది. ఎడిటర్, దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. కథకు తగ్గట్లుగానే నిర్మాణ విలువలు ఉన్నాయి.

బలాలు
* బంటి
* కొన్ని కామెడీ సీన్స్

బలహీనతలు
* కథ
* సినిమా గందరగోలంగా అనిపించడం
* లాజిక్‌లేని సన్నివేశాలు
* దర్శకత్వం
* సంగీతం

మొత్తంగా: రవిబాబు రెండున్నరేళ్ల కష్టం వృథా

రేటింగ్: 2/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.