ఏపీలో అదానీ పెట్టుబడులు! అంతా బాబు చొరవే!

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కొన్ని సంవత్సరాలు గడ్డు కాలమే అనుకున్నారంతా. కానీ అందుకు భిన్నంగా ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధి కోసం చంద్రబాబు నానా పాట్లు పడుతున్నారు. దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు గొప్ప ఏంటో తెలిసేలా నిన్న ఓ రెండు కీలక సన్నివేశాలు జరిగాయి. వీటిలో గతంలోనే ఒప్పందం కుదిరిన ఏపీపీ పేపర్ ఇండస్ట్రీ మొదటిది కాగా… రెండోది ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడుగానే కాకుండా గుజరాత్ బీజేపీ వ్యవహారాలతో పాటు బీజేపీకి సంబంధించిన ఇతర రాష్ట్రాల వ్యవహారాలను గుట్టుచప్పుడు కాకుండా మోదీ దూతగా వెళ్లి చక్కబెట్టుకురాగలడని పేరున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ఏపీ సర్కారుతో చేసుకున్న భారీ ఒప్పందం. ఏపీపీ పేపర్ పరిశ్రమ ప్రకాశం జిల్లాలో ఏకంగా రూ.24000 కోట్లతో ఏర్పాటు కానుండగా…అంతకు మూడింతల పెట్టుబడితో విశాఖ జిల్లాలో అదానీ ఓ రెండు పరిశ్రమలు పెట్టనున్నారు. అదానీ గ్రూప్ ఇందుకోసం ఏకంగా రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఈ రెండు పరిశ్రమలు ఏపీలో భారీగానే ఉద్యోగావకాశాలను సృష్టిస్తాయి. రాష్ట్రం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ తరహా పరిశ్రమలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగానే చంద్రబాబు దూకుడుగా వ్యవహరిస్తున్నారు కూడా.

ఇంతవరకు బాగానే ఉన్నా.. మోదీ సన్నిహితుడిగా ఉన్న అదానీ ఏపీకి వచ్చి బాబు ముందు ప్రత్యక్షమవడంతో పాటుగా ఏకంగా రూ.70 వేల కోట్ల పెట్టుబడితో ఏపీలో పరిశ్రమ పెట్టనున్నట్లు ప్రకటించడం ఆ వెంటవెంటనే చంద్రబాబు సర్కారుతో ఒప్పందం చేసుకోవడంపై భారీ చర్చలు మొదలయ్యాయి. మోదీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న అదానీ.. అదే మోదీకి బద్ధ విరోధిగా ఉన్న చంద్రబాబు స్టేట్ లో పెట్టుబడి పెట్టడం, అది కూడా ఆ రాష్ట్రానికి ఇప్పటిదాకా రానంత పెద్ద పెట్టుబడి పెట్టడమంటే మాటలు కాదు మరి. దీని వెనుక మోదీ వ్యూహం ఏమైనా ఉందా? అన్న కోణంలో కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. ఏపీ చంద్రబాబు ముందుచూపు, ఆయన పారిశ్రామిక విధానాలు, పరిశ్రమలతో ఉద్యోగాల రూపకల్పనలో ఆయన చూపే చొరవే ఈ భారీ పెట్టుబడులకు కారణం అని మరోవైపు జోరుగా చెప్పుకుంటున్నారు జనం. మొత్తానికి అదానీ లాంటి పెద్ద పారిశ్రామిక వేత్త భారీ పరిశ్రమతో ఏపీకి రావటం శుభ పరిణామం అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.