సూర్య తండ్రి తప్పు దిద్దుకున్నాడు..

కోలీవుడ్లో అత్యంత గౌరవనీయ కుటుంబాల్లో సూర్య ఫ్యామిలీ ఒకటి. సూర్యతో పాటు కార్తి చాలా హుందాగా ప్రవర్తిస్తుంటారు. వీరి తండ్రి శివకుమార్‌కు కూడా అక్కడ మంచి పేరుంది. కుటుంబమంతా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతూ జనాల మనసులు దోచారు. ఇంత మంచి ఇమేజ్ ఉన్న కుటుంబం ఇటీవల ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. ఒక దుకాణ ఆరంభోత్సవానికి వెళ్లిన శివకుమార్.. కొంచెం దూరంగా నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న అభిమాని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ ఫోన్ విసిరి కొట్టాడు. ఈ ఘటనతో శివకుమార్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఉదంతం విషయమై శివకుమార్ సారీ చెప్పినా వివాదం సద్దుమణగలేదు.
అందరి ముందు తన ఫోన్‌ను పగలగొట్టేసి ఇలా వీడియో ద్వారా శివకుమార్‌ సంజాయిషీ ఇవ్వడం రాహుల్‌కు నచ్చలేదు. శివకుమార్ ప్రవర్తన తననెంతో బాధించిందని.. ఇకముందు ఏ సెలబ్రెటీతోనూ తాను సెల్ఫీ దిగనని అతనన్నాడు. ఈ నేపథ్యంలో శివకుమార్.. బాధిత కుర్రాడికి సాంత్వన చేకూర్చే ప్రయత్నం చేశాడు. రాహుల్‌కు రూ.21 వేల ఖరీదైన వివో స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు శివకుమార్. ఆయన తరఫున ఓ ప్రతినిధిని పంపి రాహుల్‌కు ఫోన్ అందేలా చూశాడు. తన చర్య పట్ల రాహుల్ ఇప్పటికీ బాధ పడుతున్న నేపథ్యంలో శివకుమార్‌ కొత్తగా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు. ‘‘నేను చేసింది తప్పని మీకు ఇప్పటికీ అనిపిస్తే నన్ను క్షమించండి. నేను అలా చేసి ఉండకూడదు’’ అని శివకుమార్ అన్నాడు. మొదట రాహుల్‌కు సారీ చెప్పడానికి కూడా సుముఖంగా లేని శివకుమార్.. ఆ తర్వాత సోషల్ మీడియాలో కనిపించిన వ్యతిరేకత చూసి వెనక్కి తగ్గాడు. సారీ చెప్పడంతో పాటు ఫోన్ కూడా కొనిచ్చాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.