సీఎంపై బీజేపీ ప్లాన్‌ను బయటపెట్టిన శివాజీ

లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోయినా వెనకడుగు వేయని ఆయన అభివృద్ధి విషయంలో మాత్రం రాజీ పడడం లేదు. ఈ కారణంగానే గత ఎన్నికల్లో పని చేసిన టీడీపీ-బీజేపీ ఇప్పుడు బద్ధ శత్రువుల్లా మారిపోయాయి. ఏపీ హక్కుల విషయంలో మోసం చేసిందనే కారణంతో టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య దూరం బాగా పెరిగిపోయింది. తర్వాత టీడీపీ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం.. కేంద్ర ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తుండడంతో బీజేపీ ఏపీ సీఎంను టార్గెట్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ వార్తలకు బలం చేకూర్చుతూ నటుడు, ప్రత్యేక హోదా సాధన కోసం శ్రమిస్తున్న శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం ఆపరేషన్ గరుడను ప్రయోగించి ఏపీలో కల్లోలం సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని చెప్పిన ఆయన.. ఇప్పుడు చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని మరో బాంబు పేల్చాడు. దీంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది.

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గరుడను మరో రూపంలో అమలు చేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సీఎం చంద్రబాబుకు కేంద్రం నోటీసులు జారీ చేస్తున్నట్లు తనకు సమాచారం అందిందన్నారు. ప్రస్తుతం విషయం బయటపడింది కాబట్టి.. నాలుగు రోజులు ఆలస్యమైనా నోటీసులు ఇస్తారని చెప్పారు. శివాజీ వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేగింది. మరోవైపు దీనిపై తెలుగుదేశం అభిమానులు కలవరపాటుకు గురవుతున్నారు. వాస్తవానికి చంద్రబాబును ఇరుకున పెట్టే ఆధారాలేమీ కేంద్రం దగ్గర లేవనే టాక్ వినిపిస్తోంది. మహా అయితే గతంలో ఆయన స్టే తెచ్చుకున్న కొన్ని కేసులను తిరగదోడడం ద్వారా చంద్రబాబు దృష్టిని మళ్లించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారమూ జరుగుతోంది. ఒకవైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబును కట్టడి చేయాలని, తద్వారా వైసీపీకి మేలు చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు ఏ నష్టమూ జరిగే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ.. తన మనుగడ గురించి ఆలోచిస్తే బెటర్ అనే టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.