మోడీకి నిఖిల్ పంచ్.. డిస్క‌షన్ ఇంకా ఉంది

టాలీవుడ్లో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హీరోల్లో నిఖిల్ సిద్దార్థ ఒకడు. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాల మీదే కాదు.. సామాజిక అంశాలు, రాజకీయాలు, క్రీడలు.. ఇతర అంశాల మీద నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెబుతుంటాడు నిఖిల్. ఈ క్రమంలోనే అతను గత నెల విజయ్ దేవరకొండను ఉద్దేశించినట్లుగా వేసిన ఒక ట్వీట్ వివాదం రాజేసింది. దాని మీద కొన్ని రోజుల పాటు హాట్ హాట్ డిస్కషన్లు నడిచాయి. ఆ వ్యవహారం సద్దుమణిగాక తిత్లీ తుపాను బాధితుల్ని ఆదుకునేందుకు అతను చేసిన ప్రయత్నం అందరి ప్రశంసలు అందుకుంది. నిఖిల్‌ను చూసి టాలీవుడ్లో మిగతా హీరోలు నేర్చుకోవాంటూ నెటిజన్లు అభిప్రాయపడ్డారప్పుడు. తాజాగా నిఖిల్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. నరేంద్ర మోడీ సర్కాను ఉద్దేశించి అతను చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహ నిర్మాణం కోసం ఏకంగా కేంద్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు వెచ్చించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పటేల్‌ను గౌరవించడం అవసరమే కానీ.. అందుకోసం అంత ఖర్చు చేయాలా అన్న చర్చ జరుగుతోంది. ఈ విషయమై నిఖిల్ ట్వీట్ చేశాడు. పటేల్‌ను గౌరవించుకోవడం సరైందే అని.. కానీ ఒకవేళ ఆయన బతికి ఉంటే తన విగ్రహ నిర్మాణ కోసం ఇంత ఖర్చు చేస్తున్నట్లు చెబితే ఆమోదించేవారా అని ప్రశ్నించాడు. నిఖిల్ ట్వీట్ నెటిజన్లకు బాగా నచ్చింది. భలే అడిగావ్ బాసూ.. మోడీ సర్కారుకు సరైన పంచ్ ఇచ్చావ్ అంటూ అతడిని పొగిడేశారు నెటిజన్లు. కొందరు మాత్రం నీకెందుకు రాజకీయాలు అని ప్రశ్నించారు. ఐతే మెజారిటీ జనాలు నిఖిల్‌పై ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్లో పెద్ద రేంజ్ హీరోలంతా రాజకీయ నేతల్ని ఏమంటే ఏమవుతుందో.. ఎవరితో ఏం అవసరం పడుతుందో అనుకుంటూ ఇలాంటి వ్యవహారాలపై మౌనం పాటిస్తుంటారు. కానీ నిఖిల్ ధైర్యంగా ఇలాంటి ట్వీట్ వేసినందుకు అభినందించాల్సిందే.
అయితే, అఖిల్ ఈ ట్వీట్‌తో వ‌దిలేయ‌కుండా దానికి వచ్చిన ముఖ్య‌మైన స్పంద‌న‌ల‌పై త‌న అభిప్రాయాలు చెబుతూ ఉన్నారు. అంద‌రినీ అంగీక‌రిస్తూనే త‌న వాద‌న‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. న‌టులు ఇలా సామాజిక విష‌యాల్లో యాక్టివ్‌గా ఉండ‌టం స‌మాజానికి మేలు చేసేదే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.