ఆంధ్రజ్యోతిని వద్దన్నది అందుకేనట

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను కవర్ చేసేందుకు ఆంధ్రజ్యోతి పత్రికను అనుమతించేది లేదని మరోసారి చెప్పారు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి. గోబెల్స్ ప్రచారంలో తప్పును పదే పదే ప్రసారం చేస్తూ రాస్తూ ఆ మీడియా పనిచేస్తుందని విరుచుకుపడ్డారు. టీడీపీ, సిఎం చంద్రబాబు తప్పులను ఎత్తిచూపడంలో ఆ వర్గ మీడియా పూర్తిగా విఫలమైందని జగన్ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోక పోతే ఒక్క వార్త రాయడం ఆ పత్రికకు ఇష్టం లేకపోయిందంటున్నారు. వాస్తవంగా జగన్ పాదయాత్రకు సంబంధించిన విషయాలను ఆంధ్రజ్యోతి కవర్ చేస్తోంది. కాకపోతే జగన్ ఆశించిన స్థాయిలో చేయలేక పోవచ్చు. ఒక పత్రికగా వార్తకు ప్రాధాన్యత ఎంత ఇవ్వాలో ఏంటనేది ఆయా మేనేజ్ మెంట్ ను బట్టి ఆధారపడి ఉంటోంది. ఏబీఎన్ రాధాకృష్ణ పై ఇప్పటికే కోర్టుకు వెళ్లింది వైకాపా. అందుకే ఆ పత్రిక, టీవీ చానల్ వారిని తమ సమావేశాలకు ఆహ్వానించేది లేదని చెప్పారు. 
చంద్రబాబు చేసిన తప్పులను చెప్పలేని మీడియా తమకు అక్కరలేదన్నారు. అంతే కాదు… పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు డబ్బులిస్తూ ఆడియో, వీడియోలలో దొరికిన వారి గురించి రాయక పోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మొత్తంగా ఇది జగన్, ఆంధ్రజ్యోతి వార్ లాగా ఉంది. గతంలో టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు రాసింది. ఒక దశలో కేసీఆర్ పై విరుచుకుపడింది. ఆ తర్వాత లోపాయికారిగా ఏం జరిగిందో తెలియదు. కేసీఆర్ కు వ్యతిరేకంగా వార్తలు రాసే సాహసం చేయడం లేదు ఆంధ్రజ్యోతి. ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా వార్తలు రాసే సాహసం చేయడం లేదనేది జగన్ విమర్శ.
ఆ మాటకొస్తే సాక్షి పత్రిక, సాక్షి టీవీలను టీడీపీ బహిష్కరించింది. తమకు వ్యతిరేకంగా రాస్తుందనేది ఇందుకు కారణం. మంచి చేసినా వారు చెప్పరు. అందుకే వారిని రానివ్వడం లేదని తెలుగు తమ్ముళ్లు చేసే వాదన. మొత్తంగా ఇప్పుడు ఆంధ్రజ్యోతి, సాక్షి మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు అనుకూల వార్తలు వస్తుండగా.. సాక్షిలో జగన్ అనుకూల వార్తలు వస్తున్నాయి. ఏ పత్రికలు నిస్పక్ష పాతంగా పని చేయడంలేదనేది జనాల మాట. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.