తెలంగాణ పై ఓ నెటిజన్ రాసిన లేఖ…

తెలంగాణను ఆ దేవుడే కాపాడాలి. 1947 నుండి 2014 వరకు తెలంగాణ అప్పులు 70000 కోట్లు, 2014-2018 వరకు తెలంగాణ మొత్తం అప్పులు రూ. 1,67,091కోట్లు. అంటే 67 సంవత్సరాల్లో సుమారు 13 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ నెత్తిన 70వేల కోట్లు అప్పులు మోపారు. కానీ మన లెజెండ్ సీఎం కేసీఆర్ సాబ్ ఒక్కడే మూడేండ్లలోనే 87వేల కోట్లకు పైగా అప్పులు మోపారు. వడ్డీలకే నెలకు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నాం అంటే మనం రాబోయే 5 ఏండ్లల్లో బీహార్, ఒరిస్సా కంటే అధ్వాన్నం కానున్నామా? సిరిసంపదలు, ఆర్థిక పరిపుష్టితో “అమెరికా”నే తలదన్నిన “వెనిజులా”దేశం మితిమీరిన ఖర్చులు, లోపించిన ఆర్థిక క్రమశిక్షణతో చిల్లి గవ్వ లేక, ప్రజలకు అన్నం కూడా దొరకని ఘోర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఉద్యమకారుల చెమట, రక్తం, ప్రాణాలు అర్పించి సాధించుకున్న “తెలంగాణ”కు ఎన్నికైన పాలకులు మొదట్లో ఏమన్నారు? కడుపు కట్టుకొని పనిచేస్తాము, బంగారు తెలంగాణా సాధిస్తాము అని..ఇప్పుడు చూస్తే మిగులు, ధనిక రాష్ర్టంగా ఉన్న తెలంగాణ అప్పుల ఊబిలోకి పోతుందా అని అనిపిస్తుంది. 10 ఏండ్ల తర్వాత చేపట్టవలసిన మిషన్ భగీరథను ఇప్పుడే చేపట్టి 65 వేల కోట్లు, 24 గంటల కరెంట్ పేరుతో 10వేల కోట్లు, అడ్డుఅదుపు లేకుండా జీతాల పెంపుతో 10వేల కోట్లు, పద్దతి పాడు లేని ఎర్రవెల్లి, నరసన్నపేట, గజ్వేల్ తరహాల పేరుతో 10వేల కోట్లు…దేవుళ్ళు, అవార్డులు, మొక్కుల పేరుతో మరో 10వేల కోట్లు.. చెప్పుకుంటూ పోతే వోడిసే ముచ్చెటేనే కాదు…సీఎం ఏమి చేస్తాడో మంత్రులకు తెలియదు, మంత్రులు ఏమి చెయ్యాలో సీఎం చెప్పడు.పాలనలో క్రమశిక్షణ లేదు,నైపుణ్యం లేదు, ప్రణాలిక లేదు, దూరదృష్టిలేదు. అధికారులపై పాలకులకు పట్టులేదు, అజమాయిషీ లేదు. ఇప్పటికైనా మేధావులు మౌనం వీడాలి. గాడి తప్పిన ప్రభుత్వ పాలనపై ఒక కన్నెయ్యాలి. పాలకుల ఆలోచన విధానంలో మార్పు తేవాలి. అప్పుడే పోరాడి సాధించుకున్న తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు దక్కి, అమరుల ఆశయాలు నెరవేరి, దేశంలోనే ధనిక రాష్ట్రం అవుతుంది..నా ఈ అభిప్రాయం విమర్శ కాదు, ప్రతిపక్షం అంతకన్నా కాదు.. పేదల జీవితాల్లో మార్పు రావాలన్నదే నా కోరిక,సంకల్పం, ఆశ….
ఇట్లు
ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర శ్రేయోభిలాషి…..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.