65–35: ల‌గ‌డ‌పాటి విశ్లేష‌ణ‌లో హైలైట్స్ ఇవి

మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ త‌న సంచ‌ల‌న ఎగ్జిట్‌పోల్ ఫలితాలు ప్రకటించారు. జాతీయ సంస్థలన్నీ టీఆర్ఎస్‌కు పట్టం కట్టగా… లగడపాటి మాత్రం ప్రజా కూటమి గెలుస్తుందని చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ముగిసింది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. జాతీయ ఛానళ్లు, సంస్థలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాయి. లగడపాటి రాజగోపాల్‌ మాత్రం ప్రజాకూటమి గెలుస్తుందని గంట బజాయించి చెప్తున్నారు. ప్రజా కూటమికి 65, టీఆర్ఎస్‌కు 35 సీట్లు రావొచ్చని ప్లస్ ఆర్ మైనస్‌ 10 ఉంటుందని ఫ్లాష్‌ టీమ్‌ అంచనా. బీజేపీ, మజ్లిస్, స్వతంత్రులు 7 ప్లస్ ఆర్ మైనస్‌ 2 సీట్లలో గెలుస్తారని లగడపాటి రాజగోపాల్ తెలిపారు.

లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రకారం.. తెలంగాణ ప్రజా కూటమి అధికారంలోకి రాబోతోంది. కూటమి పార్టీలకు 65, టీఆర్ఎస్‌కు 35 సీట్లు రావొచ్చని ప్లస్ ఆర్ మైనస్‌ 10 ఉంటుందని అంచనా వేశారు. టీడీపీని విడిగా చూస్తే.. మలక్‌పేటలో మజ్లిస్‌ చేతిలో ఓటమి తప్పదన్నారు. మరో రెండు స్థానాలు ఇబ్రహీంపట్నం, మక్తల్‌లో స్వతంత్రులు గెలుస్తారన్నారు. 10 నియోజకవర్గాల్లో మాత్రమే TDP వర్సెస్‌ TRS అన్నట్టు సాగిందని.. అందులో 7 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు విజయబావుటా ఎగురవేస్తారని తెలిపారు. ఇక్కడ రెండు సీట్లు అటుఇటు అవ్వొచ్చన్నారు. ఓటర్లను చాలా అంశాలు ప్రభావితం చేశాయన్న లగడపాటి.. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితికి కలిపి 65 స్థానాలు రావొచ్చనే అంచ‌నాకు 10 సీట్లు అటు ఇటుగా ఉండ‌వ‌చ్చాన్నారు. టీఆర్‌ఎస్‌ 35 సీట్లకు పరిమితం అవుతుందనే అంచ‌నావ‌కు సైతం ఇదే వ‌ర్తిస్తుంద‌న్నారు.
ఇదిలాఉండ‌గా, రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ.. మళ్లీ అధికారంలోకి రావడానికి అవసరమైన మెజారిటీని సాధిస్తుందని పలు జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరికొన్ని నేషనల్ మీడియా సంస్థలు మాత్రం టీఆర్ఎస్ బొటాబొటి మెజారిటీతో గట్టెక్కుతుందని చెబుతున్నాయి. ఒక్క ల‌గ‌డ‌పాటి ఎగ్జిట్‌పోల్స్ మిన‌హా నెంబర్లలో తేడా ఉన్నా.. దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి. వాటిలో ఎవరి అంచనా నిజం అవుతుందో ఈనెల 11న తేలనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.