బాబు దీక్ష – బీజేపీ ఊహించ‌ని ఆ మూడు సీన్లు

బాబు మాట‌కారి కాక‌పోవ‌చ్చు, కానీ ఆలోచ‌న‌కారి. అత‌ను ఏదైనా దృష్టిపెడితే… అలా పోతూ ఉంటాడు. కొంత‌కాలంగా అత‌ని దృష్టి ప్ర‌త్యేక హోదాపై ప‌డింది. ఇక అంతే… అహోరాత్రులు అదే కాన్సెప్టును మారుమోగిస్తున్నాడు. చివ‌ర‌కు తాను చేసిన ప్ర‌తి విమ‌ర్శ మోడీకి చేరేదాక వ‌ద‌ల్లేదు. మొన్న గుంటూరు స‌భ‌లో అప్ప‌టివ‌ర‌కు బాబు మోడీపై చేసిన ప్ర‌తి విష‌యం మోడీ ప్ర‌స్తావించారు బాబు ఇంపాక్ట్ మోడీపై భారీ స్థాయిలో ఉన్న‌ట్టే. మెల్ల‌గా మొద‌లు పెట్టి ప్ర‌త్యేక హోదాను ఒక ఉద్య‌మ రూపంలోకి తెచ్చారు చంద్ర‌బాబు. దానిని ప్ర‌జ‌ల‌కు ఓ సెంటిమెంట్‌లా, సెల్ఫ్ రెస్పెక్ట్‌లా మార్చారు బాబు. అయితే, బాబు ప్ర‌త్యేక హోదా పోరాటం ఏదో రాష్ట్రంలో చేస్తారు ఆ మూల‌నున్న ఆంధ‌ప్ర‌దేశ్‌కి జాతీయ మీడియా వ‌చ్చేదీ లేదు చ‌చ్చేదీ లేదు అనుకున్నాడు మోడీ. కానీ దానిని ఒక జాతీయ పోరాటంగా మ‌లిచి అన్ని పార్టీల చేత హామీ ఇప్పించుకునే లెవెల్‌కి వెళ్లారు చంద్ర‌బాబు. ఇక ఈరోజు జ‌రిగిన ధ‌ర్మ పోరాట దీక్ష‌లో మూడు ఊహించ‌ని సీన్లు మోడీ బ్యాచ్‌కి నిద్ర ప‌ట్ట‌కుండా చేశాయి. అవేంటో ఓసారి చూద్దాం.

1. మ‌న్మోహ‌న్ రాక‌
మ‌న్మోహ‌న్ సింగ్‌… మాజీ ప్ర‌ధాని. దేశాన్ని దారిలో పెట్టిన ప్ర‌ముఖుల్లో ఒక‌డు. ముఖ్యంగా ఈరోజు పోరాడుతున్న ప్ర‌త్యేక హోదాను ప్ర‌ధాని హోదాలో ప్ర‌క‌టించిన వ్య‌క్తి. కాంగ్రెస్ వాళ్లు రాహుల్ లేదా ఇంకా ఎవ‌రైనా వ‌స్తారే అని బీజేపీ అనుకుంది కానీ హామీ ఇచ్చిన మ‌న్మోహ‌న్ వ‌స్తాడు అని అనుకోలేదు. దీనివ‌ల్ల దీక్ష‌కు శాంక్టిటి వ‌చ్చింది. హామీ ఇచ్చిన ప్ర‌ధాని రావ‌డం అంటే… ఆంధ్రుల్లో అరే కాంగ్రెస్ వ‌స్తే క‌చ్చితంగా హోదా ఇస్తుంది అన్న న‌మ్మ‌కాన్ని రెట్టింపు చేసిన‌ట్ట‌వుతుంది. అంతేకాదు, జాతీయ మీడియా కూడా ఈ పోరాటాన్ని సీరియ‌స్‌గా చూస్తుంది.

2. శివ‌సేన మ‌ద్ద‌తు
కొట్టుకున్నా తిట్టుకున్న శివ‌సేన త‌మ ఫ్రెండే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంది బీజేపీ. అది మా బ్రీడే అనుకుంటుంది. అలాంటి పార్టీ చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా పోరాటానికి మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని బీజేపీ ఊహించ‌లేదు. విచిత్ర‌మేంటంటే.. ఆ రాష్ట్రంలో కూడా ఇలాంటి డిమాండ్లు ఉన్న నేప‌థ్యంలో ఏపీకి మ‌ద్దతు ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం కాగా బీజేపీకి మాత్రం ఇది ఆందోళ‌న‌క‌రం. దీనిని అస్స‌లు ఊహించ‌లేదు.

3. బీజేపీ సీనియ‌ర్ల మ‌ద్ద‌తు
బాబు పోరాటం చేస్తున్న‌దే మోడీ అహంకారంపైన‌. అలాంటిది బాబు దీక్ష‌కు ఆ పార్టీ నుంచే మ‌ద్ద‌తు వ‌స్తుంద‌ని ఎవ‌రైనా ఊహిస్తారా? కానీ వ‌చ్చింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా, ఏపీకి జ‌రిగిన అన్యాయానికి నిర‌స‌న‌గా చేస్తున్న ఈ దీక్ష‌కు బీజేపీ రెబెల్ నేతలు శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపారు. అంతేకాదు… బీజేపీ కండువాలతో సభకు వ‌చ్చారు వాళ్లు. కేంద్రం వైఖ‌రిని త‌ప్పు ప‌డుతు చంద్ర‌బాబును శ‌భాష్ అన్నారు.

అస‌లే ఎన్నిక‌ల టైంలో మోడీని బాబు బాగా డ్యామేజ్ చేశాడ‌ని ఫీల‌వుతున్న బీజేపీ.. ఈరోజు చంద్ర‌బాబు ఇచ్చిన షాకుల‌కు పెద్ద డైల‌మాలో ప‌డిపోయింది. చంద్ర‌బాబును అన‌వ‌స‌రంగా కెలికాం. మోడీపై పోరాటాన్ని బాబు స్వ‌యంగా త‌ల‌చుకున్నా ఆపలేని స్థాయికి తీసుకెళ్లారు అంటూ ఆందోళ‌న‌లో ప‌డింది. అయితే… ఈ రోజు జ‌రిగిన పై మూడు సీన్ల‌కు మాత్రం మోడీ బాగా హ‌ర్ట‌యిన‌ట్లు వినికిడి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.