కన్నడ పీఠంపైన యడ్యూరప్ప 

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయించారు. బెంగళూరు రాజ్ భవన్ లో గవర్నర్ వాజుభాయి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. దీంతో ఈ కార్యక్రమం ఐదు నిమిషాల్లోనే ముగిసింది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావడం ఇది మూడో సారి. 2007లో మొదటి సారి సి.ఎం అయిన యడ్డీ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే కొనసాగారు. బలనిరూపణ సమయంలో కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో  కేంద్రం యడ్యూరప్ప ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధించింది. మళ్ళీ 2008లో యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. మూడేళ్ల రెండు నెలల పాటు సి.ఎంగా పనిచేసిన ఆయన తీవ్ర అవినీతి ఆరోపణలతో పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కొంత కాలం జైలు లో గడిపిన యడ్యూరప్ప బీజేపీకి దూరమయ్యారు. సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని 2013 ఎన్నకల్లో బీజేపీ ఓటమికి కారణమయ్యారు. ఆ తర్వాత తిరిగి సొంత గూటికి చేరుకున్న యడ్డీ రాష్ట్ర బీజేపీకి పెద్ద దిక్కుగా మారారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీని అతి పెద్ద పార్టీగా నిలబెట్టి గవర్నర్ సహాయంతో మూడో సారి ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చుకున్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు పదిహేను రోజుల్లో ఆయన తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఇఫ్పటికే కాంగ్రెస్ కోర్టును ఆశించిన నేపథ్యంలో  ముఖ్యమంత్రి పీఠం యడ్యూరప్ప వద్ద ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*