ఉత్త ప్ర‌ధానా.. ఉత్త‌మ ప్ర‌ధానా!! 

క‌ర్ణాట‌క‌లో గెలిచామ‌ని భావిస్తున్న బీజేపీ.. రేపో.. మాపో అధికారం చేప‌ట్టాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. సంప్ర‌దాయ పార్టీగా త‌న‌కున్న ఇమేజ్ ఎంత వ‌ర‌కూ డ్యామేజ్ అయింది. అవుతుంద‌నే విష‌యాన్ని ప‌క్క‌న‌బెట్టిన‌ట్టుంది. అందుకే.. దిగ‌జారు రాజ‌కీయాల‌కు తెర‌లేపింది. ఇది విప‌క్షాలు అంటే కొత్తేంకాదు.. కాషాయ‌గూటిలో ఏళ్ల‌ త‌ర‌బ‌డి ఉన్న నేత‌ల అంత‌రంగం. ఇక సామాన్య కార్య‌క‌ర్త‌లైతే.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీను దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక వాజ్‌పేయి. మ‌రో అధ్వాణీ న‌డిచిన క‌మ‌లం పార్టీలో విష‌పు చుక్క‌లు ఎలా వ‌చ్చాయంటూ ఆవేద‌న చెందుతున్నారు.
న‌రేంద్ర‌మోదీను అభిమానించి.. సారీ.. పూజించే.. ఓ ప్రియ‌భ‌క్తుడు.. ఏకంగా మోదీను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. ఆర్ ఎస్ ఎస్ నేప‌థ్యం.. అవినీతి అంట‌ని నేత‌గా ముద్ర‌వేసుకున్న అభిమాన నేత‌.. కేవ‌లం ప‌ద‌వి కోసం.. అదీ ద‌క్షిణాధిన ప‌రువు కాపాడుకోవాల‌నే ఆరాటంతో ఇంత నీచ రాజ‌కీయాల‌కు దిగ‌జారారా! అంటూ వాపోయాడు. నిజ‌మే.. 2014లో ఎన్‌డీఏ కూట‌మి బ‌రిలోకి దిగినా.. బీజేపీ ఏకంగా మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. అప్ప‌టికి ప‌దేళ్ల కాంగ్రెస్ స‌ర్కారుపై ఉన్న వ్య‌తిరేక‌త మోదీకు క‌ల‌సివ‌చ్చింది. కానీ.. అదంతా త‌న గొప్పే అన్న‌ట్లుగా మోదీ కూడా రెచ్చిపోయారు. ఎవ‌రినీ ఖాత‌రు చేయ‌కుండా క‌ఠిన నిర్ణ‌యాల‌తో జ‌నాన్ని ఉడికించారు. కానీ.. దేశ‌భ‌క్తి అనే ఒకే ఒక సెంటిమెంట్‌తో జ‌నం.. మోదీకు జై కొట్టారు. నోట్ల‌ర‌ద్దు, జీఎస్‌టీ, పాకిస్తాన్ శిబిరాల‌పై దాడులు ఇవ‌న్నీ దేశ‌భ‌క్తి కోటాలో చేరాయి. ఒకవైపు స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్‌తో మ‌రోసారి పాక్‌పై దాడులు చేసి.. దాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవాల‌నే ఆరాటం కూడా బీజేపీ ప్ర‌భుత్వంలో క‌నిపిస్తుంది. కాంగ్రెస్ స‌ర్కారుతో పోల్సితే.. స్కాములు లేవు. అవినీతి లేదు. అంత‌వ‌ర‌కూ ఓకే. మ‌రి.. బీజేపీ కూడా.. అధికారం కోసం క‌క్కుర్తిప‌డ‌టాన్ని జ‌నం జీర్ణించుకోలేక‌పోతున్నారు. క‌మ‌లంతో పోల్సితే.. కాంగ్రెస్ బెట‌ర్ అనేంత‌గా విసిగిపోయారు.  దేశాల‌న్నీ చుడుతూ.. భార‌తీయ‌త గొప్ప‌త‌నం చెబుతూ.. విదేశాంగ విధానం అమ‌లు చేస్తున్న ఉత్త‌మ ప్ర‌ధాన‌మంత్రిగా మోదీకు ప్ర‌పంచం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుందంటే దానికి కార‌ణం.. కేవ‌లం భార‌త‌దేశంలో వున్న మార్కెట్‌. ప్ర‌పంచ దేశాల‌న్నింటికీ 120 కోట్ల జ‌నాభా కొనుగోలు శ‌క్తి కావాలి. పెట్టుబ‌డులు పెట్టే దేశాల‌కు లాభాలు పండాలి. కానీ ఇదంతా త‌న‌దే అనుకుంటూ ఊహ‌ల్లో విహ‌రించే మోదీను ప్ర‌జ‌లు.. ఉత్త‌మ ప్ర‌ధాని అనుకుంటున్నారా! లేక ఉత్త ప్ర‌ధానిగా భావిస్తున్నారా! అనేది తెలియాలంటే మ‌రికొద్ది కాలం ఆగాల్సిందే.  

1 Comment

  1. Chetha Pradhani. independence vachina tarvata 70years lo enta worst pm ni chudaledu. enta twaraga modi mukth bharat jarigite anta desam anto gopaga develop avutundi. veedu podu abhivrudi states ni cheyadu. gujarat tapaa. gujarat laga anni states ni develop chestanu ante bjp ki vote vesari. ante kani gujarat ni develop cheyamani kadu.

Leave a Reply

Your email address will not be published.


*