అమెరికాలో కమలానికి తెలుగుసెగ

ఒకసారి ఒక జాతికి ద్రోహం చేస్తే , ఒక జాతిని వంచిస్తే.. ఆ పాపం ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది ఒకసారి వంచనకు పాల్పడిన తరువాత… రాష్ట్రం దాటి వెళ్లినా, దేశం దాటి వెళ్లినా, ఖండాలను దాటి వెళ్లినా… ఆ పాపం నుంచి తప్పించుకోజాలరు. ఆ విషయం ఇప్పుడు బీజేపీ నాయకులకు స్వానుభవంలోకి వస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా… చేసిన అన్యాయాన్ని వారు వివిధ వేధికాలమీద అనేక రకాలుగా సమర్థించుకున్నారు. ప్రతిచోటా వారి మాటలకు ప్రతిఘటనలు ఎదురయ్యాయి. చివరికి అమెరికా వెళ్లి ఇవే బొంకులను ప్రచారం చేయడానికి సాహసించినప్పుడు కూడా బీజేపీ నాయకులకు ఎదురుదెబ్బే తగిలింది.

 

 

 

దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలిచే సత్తా తనకు ఎప్పటికీ లేకపోయినా.. చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టిపోయడంలో సృజనాత్మకత చూపించడం ద్వారా రాజ్యసభ ఎంపీ కగలిగిన జీవీఎల్ నరసింహారావు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. మోడీ చేసిన వంచనను మసి పూసి మారేడు కాయ చేస్తున్నారు. కానీ అక్కడ కూడా ఆయనకు ప్రతిఘటన తప్పడం లేదు.

న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ లో బీజేపీ ఒక కార్యక్రమం నిర్వహించింది. కర్ణాటక ఎన్నికల విజయాన్ని పురస్కరించుకుని విజయోత్సవ సభ లాగా దీనిని నిర్వహించారు. దీనికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ను ఆహ్వానించారు. ఆయన ఎప్పటిలాగానే.. ప్రత్యేకహోదా వంచన విషయంలో పాచిపోయిన పాట పాడడం ప్రారంభించారు. హోదా ను మించిన ప్యాకేజి ఇస్తున్నామని, చంద్రబాబు తీసుకోవడం లేదని, నానా అవాకులు చెవాకులు పేలడం ప్రారంభించారు. ఈ వరుస అబద్దాలను సహించలేకపోయిన సభికులైన ప్రవాసాంధ్రులు లేచి నిల్చుని, మీరు అన్నీ అబద్దాలు చెబుతున్నారంటూ నిలదీశారు. సభలో గందరగోళం చెలరేగింది. “ఈ నిరసనలు కూడా వ్యూహాత్మకంగా చేస్తున్నవే అని, మీరు అందరూ దుష్ప్రచారపు మాయలో పడుతున్నారని” నరసింహారావు కాసేపు బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ ఆ పాచిక కూడా పారలేదు. ఈలోగా నరసింహారావు బుకాయింపులను అడ్డుకున్న వారిని బలవంతంగా సభనుంచి బయటకు పంపించారు. “గత ఎన్నికల్లో మేము కూడా మోడీ మాటలను నమ్మి ఆయనకు మద్దతు ఇచ్చాం. అందువల్ల మా మిత్రులను కూడా కోల్పోయాం. కానీ మీరు తెలుగు జాతిని వంచించారు” అంటూ పలువురు తీవ్రంగా విమర్శించారు. ఈ తాకిడి తట్టుకోలేకపోయిన నరసింహారావు తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించేశారు.

మొత్తానికి తెలుగు జాతికి చేసిన ద్రోహం బీజేపీని అమెరికాలో కూడా విడిచిపెట్టలేదని పలువురు అనుకుంటున్నారు.

2 Comments

  1. ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీని ఆకాశానికి ఎత్తేయడాన్ని తప్పుపట్టం . కానీ సొంత తెలుగు జాతికి ద్రోహం చేస్తున్నా మిన్నకుండిపోవడం,పైపెచ్చు ఎదురుదాడిచేసి ఆంధ్రులను మరింత నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేయడం క్షమించరాని నేరం.

  2. వార్తలు అమ్ముకుని బతికిన జివిల్ .నరసింహరావు తెలుగు జాతి పట్టిన చీడ పురుగు,, వాడి బ్రతుకంతా అబద్దపు వార్తలు అమ్ముకొని ,,మోడీ భజన చేసి తెలుగు వారి పరువు ను తీయటానికి పుట్టిన కందిరీగ జన్మ.

Leave a Reply

Your email address will not be published.


*