ఆడియో ఫంక్షన్లకు అందుకే వెళుతున్నారంట…

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్ష‌ణం తీరిక లేక‌పోయినా సినిమా వేడుక‌ల‌కు మాత్రం బాగానే హాజ‌ర‌వుతున్నాడు. త‌న సినిమాలే పెద్దగా చూడ‌ని ప‌వ‌న్ ఇత‌ర హీరోల సినిమాలు చూడ‌టం మామూలు విషయం కాదు. హీరోల ఆడియో ఫంక్ష‌న్ల‌కు అతిథిగా వెళ్ల‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యప‌రుస్తోంది. నాలుగు రోజులు తిరుపతిలో తిరిగే సరికి దేవుడు కనిపించాడట పవన్ కు. హాయిగా సినిమాలు చేసుకోక ఇంత కష్టం ఎందుకని ఆయనకు తెలిసిన వారు అంటున్నారట. చ‌ర‌ణ్ కోసం వెళ్ల‌క‌పోతే అబ్బాయ్ ఫీల‌వుతాడ‌ని `రంగ‌స్థలం` స‌క్సెస్ మీట్ కు వెళ్లాడు పవన్. బ‌న్నీ హ‌ర్ట్ అవుతాడ‌ని `నా పేరు సూర్య` స‌క్సెస్ మీట్ కు వెళ్లిన సంగతి తెలిసిందగే. ఆ తర్వాత ర‌వితేజ‌- రామ్ తాళ్లూరి కోసం `నేల టిక్కెట్` ఆడియో కు అతిథిగా హాజ‌రై అన్నయ్య రూటును ఫాలో అవుతున్నాడు. 
ఇప్పుడు మ‌రో యంగ్ హీరో ఆడియోకు కూడా అతిధిగా వెళ్తాన‌ని స‌ద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మాటిచ్చాడు ప‌వ‌న్. నిర్మాత‌ బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు సాయి శ్రీనివాస్, శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో `సాక్ష్యం` సినిమాలో న‌టిస్తున్నాడు. అభిషేక్ నామా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఈనెల 26న గ్రాండ్ గా హైద‌రాబాద్ లో ఆడియో వేడుక జ‌రిపేందుకు సిద్దమయ్యారు. ఈ వేడుక‌లకు ప‌వ‌న్ అతిధిగా హాజ‌ర‌వుతున్నాడట‌. ఈ చిత్ర నిర్మాత అభిషేక్, ప‌వ‌న్ ను ఆహ్వానించ‌గా వ‌స్తాన‌ని మాటిచ్చారని తెలుస్తోంది. ప‌వ‌న్ బిజీని సైతం ప‌క్క‌న బెట్టి ఇలా సినిమా వేడుక‌లు వెళ్ల‌డం వెనుక అంత‌రార్ధం ఏంటి? ఇందులో రాజ‌కీయ కోణ‌మేమైనా ఉందా? అంటే ఉంద‌నే అంటున్నారు.
రాజకీయం వంట బట్టిందా…
రాజ‌కీయ నాయ‌కులంటే అంద‌ర్నీ క‌లుపుకుని వెళ్లాలి. మనసులో ఎన్ని ఉన్నా? పైకి న‌టులుక‌న్నా ఎక్కువ‌గా న‌టించాల్సిందే. ప‌వ‌న్ ఇప్పుడు అదే ప‌నిలో ఉన్నాడ‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగుతున్నాడు కాబ‌ట్టి అంద‌రీ స‌హ‌కారం అవసరం. ప‌వ‌న్ వాళ్ల‌ను ఖుషీ చేస్తే సరి. ప‌వ‌న్ ను వాళ్లు ఖుషీ చేసే వీలుంది. అందుకే సినిమా ఫంక్ష‌న్ కు పిల‌వ‌గానే వ‌చ్చార‌నే సానుభూతితో ఆ కుటుంబాల‌లో ఓట్లు ప‌డే అవ‌కాశం ఉంది. సినిమాకు కోట్ల రూపాయాల ఉచిత ప‌బ్లిసీటీ వ‌స్తుంది మరి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*