మోదీ ఫార్ములాకు కర్ణాటక మినహాయింపేనా?

Davangere: BJP Prime Ministerial Candidate and Gujarat CM Narendra Modi interacts with former CM of the state B.S Yeddyurappa at a rally in Davangere, Karnataka on Tuesday. PTI Photo(PTI2_18_2014_000081B)

మోదీ ఫార్ములా ఏమైంది? వయోవృద్ధులకు పదవులు ఇవ్వకూడదన్న నియమానికి కర్ణాటక మినహాయింపేనా? 75 ఏళ్లు దాటిన వారికి పదవులు ఉండబోవని ఒకప్పుడు ప్రకటించిన బీజేపీ… ఇప్పుడు యడ్యూరప్పను ఎందుకు అందలం ఎక్కించింది? యెడ్డీకి కూడా 75 ఏళ్లు దాటిన నాయకుడని బీజేపీకి గుర్తులేదా? రాజకీయ భీష్మాచార్యుడు అడ్వాణీని వద్దన్నారు. పెద్దాయన మురళీమనోహర్ జోషిని కూడా వద్దన్నారు. యడ్యూరప్పకు మాత్రం ఓకే అన్నారు. అడ్వాణీని, జోషిని ఎందుకు వద్దన్నారు? మోదీ అధికారంలోకి రాగానే సీనియర్లను పక్కన పెట్టేందుకు తెలివిగా ఒక ఫార్ములాను తెరపైకి తీసుకువచ్చారు.

75 ఏళ్లు దాటాయంటూ అడ్వాణీ, జోషిలకు మంత్రి పదవులు ఇవ్వలేదు. పార్టీకి ఒక మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసి వారిని అందులో చేర్చారు. చివరికి మార్గదర్శక మండలి చేసింది ఏమీలేదు. దాంతో బీజేపీలో 75 ఏళ్ల వయసు దాటినవారికి మొండి చెయ్యెనని అర్థమయిపోయింది. కర్ణాటక రాజకీయాల్లోకి వచ్చేసరికి మాత్రం సీన్ మారిపోయింది. 75 ఏళ్లకు దగ్గరపడుతున్నారని తెలిసి కూడా రెండేళ్ల క్రితమే యెడ్డీని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అన్నీ తానై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా ఎందుకు చేశారు?

కర్ణాటకలో ఓట్లు, సీట్లు లెక్కలు వేశారు. జయాపజయాలను బేరేజు వేసుకున్న మోదీ, షా ద్వయం యెడ్డీ మినహా వేరే దారి లేదని అర్థం చేసుకున్నారు. బలమైన లింగాయత్ సామాజిక వర్గం ఓట్ల కోసమే పార్టీ నియమాలను పక్కన పెట్టారని చెబుతున్నారు. కర్నాటకలో లింగాయత్‌లు 10 శాతం వరకు ఉన్నారు. అక్కడ ఎక్కువమంది సీఎంలు కూడా లింగాయత్‌కు చెందినవారే. దాంతో బీజేపీ అధిష్టానం లింగాయత్ కార్డును వాడేసింది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పను మూడోసారి ప్రొత్సహించింది. అవసరాన్నిబట్టి బీజేపీ అధిష్టానం రూల్స్ మార్చుకుంటుందా? నిజానికి దక్షిణాదిన పాగా వేయడమే బీజేపీ ప్రధాన ధ్యేయం. అందుకే 75 ఏళ్ల నియమం మరుగున పడిపోయిందా? అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*