బీజేపీ స్కెచ్ కు కుమారస్వామి ఢమాల్

కర్ణాటకలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడింది. మెజార్టీ కూటమిని కాదని యడ్యూరప్పకు అవకాశం ఇచ్చారు గవర్నర్ వాలా. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కూటమికి ఇచ్చినట్లు తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, జేడీఎస్ ల కూటమి అడిగింది. అయినా పట్టించుకోలేదు. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది. ఇందుకు తగిన ఆధారాలను గవర్నర్ కు ఇచ్చింది. ఫలితంగా కాంగ్రెస్ నుంచి ఐదు, జేడీఎస్ నుంచి ముగ్గురుని రంగంలోకి దింపారని తెలుస్తోంది. కొంద మందిని అసెంబ్లీకి రాకుండా ఆపడం ద్వారా ఓటింగ్ కు దూరంగా ఉండేలా చేయనుంది. ఫలితంగా బల నిరూపణకు అవసరమైన మేజిక్ ఫిగర్ తగ్గనుంది. అదే బీజేపీని గట్టెక్కించనుంది. రాజ్యాంగ సంప్రదాయాలను అనుసరించి ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ సీట్లు ఉన్న పార్టీకి మొదట అవకాశం ఇవ్వాలి. కానీ కాంగ్రెస్‌, జేడీఎస్‌లు తమకు మెజార్టీ ఉందని చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ ఇచ్చిన ఆధారాలతోనే యడ్యూరప్పకు సిఎంగా ప్రమాణ స్వీకారం చేసే వీలు కల్పించారు గవర్నర్. 
తమ పార్టీ ఎమ్మెల్యేలకు భారీగా నగదు, పదవులు ఆశ చూపి ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్, జేడీఎస్ లు ఆరోపిస్తున్నాయి. గాలి బ్రదర్స్ ఇందులో కీలక పాత్ర పోఫించారని చెబుతోంది. విషయం ఏదైనా బల నిరూపణ రోజు వాస్తవాలు బయటకొస్తాయి. ప్రలోభాలకు గురి చేసినా వెనక్కు తగ్గకూడదు. తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్, జేడీఎస్ లు కాపాడుకోవాలి. ఆపని చేయడంలో విఫలమయ్యారు కాబట్టే బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. 
గతంలోను ఇంతే…
ఇప్పుడే కాదు…2008 ఎన్నికల తర్వాతా  యడ్యూరప్ప సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి 110 స్థానాలు వచ్చాయి. కానీ జనతాదళ్‌ ఎస్‌, కాంగ్రెస్‌లకు చెందిన దాదాపు 20 మంది శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఫలితంగా బలనిరూపుణకు అవసరమైన మేజిక్ ఫిగర్ తగ్గింది. యడ్యూరప్ప గట్టెక్కారు. ఈ సారి అంతే చేసే వీలుంది. ఈసారి 104 స్థానాలు మాత్రమే గెలిచింది బీజేపీ. కాబట్టి జనతాదళ్‌ ఎస్‌, కాంగ్రెస్‌ల నుంచి కనీసం ఎనిమిది సభ్యులను ఇలానే సభకు హాజరుకాకుండా చేయనంది బీజేపీ. విశ్వాసపరీక్షలో నెగ్గనుంది.  2004 ఎన్నికల తర్వాత ఒప్పందం ప్రకారం జేడీఎస్‌, భాజపాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తొలిగా 20 నెలలు అధికారంలో ఉన్న కుమారస్వామి ఆ తర్వాత ఒప్పందం ప్రకారం యడ్యూరప్పకు అధికారం అప్పగించాలి. కానీ దాన్ని అమలు చేయలేదు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సారి యడ్యూరప్పకు అలానే అడ్డు తగిలేందుకు కుమారస్వామి వర్గం గట్టిగానే పావులు కదిపింది. కాకపోతే బీజేపీ వారి కంటే ముందే మేల్కొనడంతో పని సులువుగా మారింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*