టీటీడీ కీలక నిర్ణయం పై దుమారం

తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల వయోపరిమితిపై ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం వివాదాల అగ్గి రాజేసింది. 65 ఏళ్లు దాటిన అర్చకులను విధుల నుంచి తొలగించే ఆలోచన దుమారం రేపుతోంది. వారికి ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని టీటీడీ నిర్ణయించింది. వయసు పైబడిన వారిని పక్కన పెట్టాలనే ఆలోచన మంచిదే. ఆ స్థానంలో దేవదాయశాఖ చట్టం ప్రకారం అర్హత గల మిరాశీ, నాన్‌ మిరాశీ కుటుంబాలకు చెందిన వేద పండితులను అర్చకులుగా నియమి

 

 

 

 

 

స్తామని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ చెబుతున్నారు. అసలు అర్చకుల జోలికి సుధాకర్ యాదవ్ వెళ్లడం వివాదాల తెనెతుట్టెను కదిలించినట్లు అయింది.

పాలక మండలి తొలి సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకోవడం ఇందుకు రమణదీక్షితులు వంటి వారు వ్యతిరేకించడం హాట్ టాపికైంది. గతంలో చాలా సార్లు రమణదీక్షితులు వంటి వారిని పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయినా సరే తిరిగి వచ్చారాయన. ఈ సారి అలాంటి అవకాశం లేకుండా చేసింది టీడీపీ ప్రభుత్వం. శ్రీవారి కానుకలను బ్యాంకుల్లో డిపాజిట్లు వేసే వ్యవహారంపై తగిన సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక సబ్‌ కమిటీని ఏర్పాటు చేయనుంది టీటీడీ. టీటీడీ పాలక మండలి, అధికారులు, ఏపీ ప్రభుత్వంపై ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఆయనకు నోటీసులు పంపింది టీటీడీ. 

తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయంతో 16 మందిని పక్కన పెట్టే వీలుంది. తిరుమలలో మిరాశీ కుటుంబాలకు చెందిన వంశపారంపర్య అర్చకత్వ సేవల్లో 52 మంది ఉన్నారు. ఇందులో 65 ఏళ్ల పైబడిన వారు 16 మంది. నిబంధనలు అమల్లోకి వస్తేవారిని తొలగిస్తారు. ఆలయ ప్రధానార్చక కుటుంబాలకు చెందిన రమణ దీక్షి తులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణ దీక్షితులు ఉద్యోగ విరమణ చేయాలి. ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వంటి వారు ఇందులో ఒప్పుకోవడం లేదు. వంశ పారంపర్య అర్చకత్వంలో వేలు పెట్టే అధికారం టీటీడీకి లేదని చెప్పడం మరింత విచిత్రం. టీటీడీ పాలక మండలి పైనే కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారాయన. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్న తప్పులను ఎండగట్టడం మంచిదేనన్నారు. టీటీడీ అధికారులు అజ్ఞానంతో తీసుకునే నిర్ణయాలపై మాట్లాడాల్సి వస్తుందని చెబుతున్నారాయన. 
1996లో మిరాశీలను రద్దు చేసినప్పుడు సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. బహుమానాలు, మర్యాదల్లో టీటీడీ వంశపారంపర్య అర్చకులకు ఆటంకం కలిగించవద్దని ప్రస్తావించింది. సంభావన ఏర్పాటుపై కూడా కోర్టు స్పష్టంగా ఉత్తర్వులిచ్చిందని. టీటీడీ అర్చకులను ఉద్యోగులుగా చూపుతూ ఉద్యోగ విరమణ వర్తింపజేసే ఆలోచన మంచిది కాదంటున్నారు అర్చకులు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*