గవర్నర్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమన్న కోర్టు

కర్ణాటక పరిణామాలపై సుప్రీంకోర్టు తెల్లవారుజాము వరకు విచారించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని యడ్యూరప్పను గవర్నరు ఆహ్వానించడంపై కాంగ్రెస్‌ సీరియస్ అయింది. సుప్రీంకోర్టు గడప తొక్కింది. అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని కాంగ్రెస్‌ సీనియరు నేత, న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి కోర్టును కోరడం ఇందుకు కారణం. వారు అడగడమే ఆలస్యం… ముగ్గురు న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్ర ఏర్పాటు చేశారు. ధర్మాసనంలో జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ లు ఉన్నారు. 
కాంగ్రెస్‌ అభ్యంతరాలపై సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలను అడిగింది. కాంగ్రెస్‌ తరపున సింఘ్వీ, ప్రభుత్వం తరపున ఏజీ కేకే వేణుగోపాల్‌, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విచారణకు హాజరయ్యారు. బీజేపీ, యడ్యూరప్ప తరపున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించడంతో విచారణ వాడి వేడిగా సాగింది. ఎవరికి వారే తమ వాదనలు గట్టిగా వినిపించడంతో కీలక నిర్ణయంపై ఉత్కంఠ నెలకుంది.
కోర్టులో న్యాయవాదుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. మెజారిటీ ఉన్నవారినే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. బలనిరూపణకు 15 రోజుల సమయం ఇవ్వడం పైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గోవాలో అతిపెద్ద కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన సంగతిని వారు గుర్తుచేశారు. గవర్నరుకు ఇంజెక్షన్‌ ఉత్తర్వులు ఇవ్వజాలమని సుప్పీంకోర్టు పేర్కొంది. మెజారిటీ నిరూపించుకోవడానికి అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడం సంప్రదాయం కాదా అని ధర్మాసనం వారిని అడిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఒక పార్టీని గవర్నరు పిలవకుండా కోర్టు అడ్డుకోజాలదని ప్రస్తావించింది. 
గోవా, మణిపూర్‌, మేఘాలయ, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో కూటములను మొదట ఆహ్వానించిన సంగతిని కాంగ్రెస్ న్యాయవాదులు గుర్తు చేయగా.. అప్పుడు గవర్నరుకు వ్యతిరేకంగా, ఆయనను అడ్డుకోవడానికి ఇచ్చిన ఉత్తర్వులు ఏవి లేని కోర్టు ప్రస్తావించింది. ఫలితంగా కాంగ్రెస్ శ్రేణులు ఢీలాపడగా… బీజేపీలో సంబరాలు నెలకున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*