ఎంత అన్యాయం

కిందపడ్డా పై చేయి మాదేనంటోంది బీజేపీ. గోవా, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు లేవు. అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. కూటమి పేరు చెప్పి బయటపడింది. కానీ అదే పని కర్నాటక విషయంలో చేయలేదు. మెజార్టీ సీట్లు మాకు ఉన్నాయి. ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసామని చెప్పింది. అక్కడ ఒక న్యాయం. ఇక్కడ మరో న్యాయం. చూసే వారికి ఇది కావాలని బీజేపీ చేస్తున్న నాటకమని అర్థమైంది. అందుకే బీజేపీ రెండు నాల్కలధోరణితో ఉందంటున్నారు. సామాన్య ప్రజల మాట ఇలానే ఉంది. ఆ…బీజేపీ వోడు…అంత తేలికగా కాంగ్రెస్, జేడీఎస్ ల కూటమికి అధికారం అప్పగించాడు అంటున్నారు. చివరకు అదే జరిగింది. గవర్నర్, కోర్టులను తమవైపుకు తిప్పుకునే స్థాయికి బీజేపీ దిగజారిందనే ప్రచారం సాగుతోంది. దేశంలో 22 రాష్ట్రాల్లో బీజేపీ కూటములు రాజ్యమేలుతున్నాయి. దాన్ని మరికొన్ని రాష్ట్రాలకు విస్తరించే వ్యూహంలో ఉంది కమలం. 
కర్నాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ఒకప్పుడు బీజేపీనేత. ఆ పార్టీని కాదని..మిగతా వారికి ఎలా అవకాశం ఇస్తారనుకున్నారు. చివరకు అదే నిజమైంది. అందుకే బీజేపీ తీరును ఇప్పుడు కాకపోయినా రాబోయే కాలంలో ప్రజలు గట్టిగానే బుద్ది చెబుతారని చర్చ సాగుతోంది. కమలం పెద్దల దెబ్బకు సోనియాగాంధీ లాంటి వారు ఏం చేయలేక పోతున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ లాంటి వారికి ఏం అర్థం కాని పరిస్థితి ఎదురైంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంప్ లకు తరలిస్తోంది కాంగ్రెస్, జేడీఎస్. అయినా సరే బల నిరూపణ రోజు వారు ఎదురు తిరిగే అవకాశమంది. 
ముందుంది మొసళ్ల పండగ
తమకు అంది వచ్చే ఎలాంటి అవకాశాన్ని వదలడంలేదు కమలం పార్టీ. బీజేపీకి ఇప్పుడు ఆర్ఎస్ ఎస్ పూర్తి అండగా ఉంటోంది. అదే లేకపోతే కర్నాటకలో బీజేపీకి 104 సీట్లు వచ్చేవి కాదన్నది నిజం. రానున్న కాలంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోను గెలుపు బీజేపీకి కత్తిమీద సామే. ఆ తర్వాత ఏపీ, తెలంగాణలతోపాటు..సాధారణ ఎన్నికలు నిర్వహించాలి. కాబట్టి బీజేపీ ఇలాంటి వ్యూహంతో వెళుతుందా..లేక పద్దతి మారుస్తుందా అనేది ఉత్కంఠను పెంచుతోంది. ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీ చతికలపడితే..సాధారణ ఎన్నికల పై ప్రభావం పడనుంది. అందుకే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు తెచ్చే ఆలోచన చేస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*