56 వేల కోట్ల రుణాల మాఫీ 

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చే కార్యక్రమానికి ఆయన స్వీకారం చుట్టారు. ఇందులో భాగంగా 56 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు యడ్యూరప్ప ప్రకటించారు. వ్యూహాత్మకంగానే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న యడ్యూరప్పకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే అధికారం లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. సానుభూతి కోసమే యడ్డీ గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కార్ కూలిపోవడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*