20 నుంచి పవన్ బస్సు యాత్ర

బస్సుయాత్రకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలని ఆయన ప్రణాళిక రచిస్తున్నారు. ఎన్నికల నాటికి అన్ని నియోజకవర్గాలను చుట్టేయాలని పవర్ స్టార్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో బస్సుయాత్రకు స్వీకారం చుడుతున్నారు. ఈ నెల 20న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పవన్ బస్సు యాత్ర ప్రారంభం కానున్నది. ఏకంగా 45 రోజుల పాటు మూడు జిల్లాల్లో కొనసాగనున్నది. సమస్యలను పరిశీలించడంతో పాటు పరిష్కారం కోసం కూడా ప్రయత్నిస్తానని పవన్ స్పష్టం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబడిపోయాయని ఆయన ఆరోపిస్తున్నారు. మరో వైపు ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని పవన్ ప్రకటించారు. హోదా సాధన కోసం జనసేన సైనికులు కవాతు నిర్వహిస్తారని ప్రకటించారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో కవాతు ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*