బీజేపీకి తెలుగు పంచ్ పడిందా…

కర్నాటకలో తెలుగు పంచ్ పడిందనే ప్రచారం సాగుతోంది. ఫలితాలు వాటిని నిజమని చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన నిధుల విషయంలో బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ఫలితంగా తెలుగువారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ పిలుపునిచ్చింది. తెలుగువారు ఎక్కువగా ఉండే రాయచూరు, బళ్లారి, చిక్‌బళ్లాపూర్‌, కోలార్‌ జిల్లాల్లో బీజేపీకి ఆ పంచ్ పడింది. ఇక్కడ ఉన్న 46 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ 32 చోట్ల గెలవగా.. జేడీఎస్‌ 9 స్థానాలు వచ్చాయి. ఇక బీజేపీ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. అక్కడే కాదు.. హైదరాబాద్ కర్నాటకలోను అదే తీరు. మొత్తంగా తెలుగువారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారని అర్థమవుతోంది. బెంగళూరు వంటి ప్రాంతాల్లోను తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. అక్కడ బీజేపీకి సీట్లు తగ్గాయి. 
కర్నాటకలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ రాకుండా చేయడంలో తెలుగువారు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. పైకి చెప్పకపోయినా తెలుగుదేశం నేతల మాట ఇలానే ఉంది. తెలుగువారికి అన్యాయం చేస్తే వారు ఊరుకోరని చెబుతున్నారు. నటుడు సాయికుమార్ రెండోసారి ఓటమి పాలయ్యారు. కోలార్ ప్రాంతంలో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వచ్చాయి. కంప్లిలో సురేశ్‌బాబు ఓడిపోయారు. తెలుగువారు ఎక్కువగా ఉన్నారక్కడ. మొత్తంగా బీజేపీ మేజిక్ ఫిగర్ రాకపోవడానికి తెలుగువారి సత్తా ఉందనేది అర్థమవుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*