బీజేపీ కే అవకాశమిచ్చిన గవర్నర్

ఉత్కంఠకు తెరపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన చాణక్యాన్ని ప్రదర్శించింది. మెజార్టీ సీట్లు తమకు ఉన్నాయని యడ్యూరప్ప చెప్పిన మాటలను నమ్మింది. ఫలితంగా కర్నాటక గవర్నర్‌ వజుభాయ్‌ వాలా యడ్యూరప్పను సిఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. బీజేఎల్పీ నేత బీఎస్‌ యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు సిద్దమయ్యారు. రేపు ఉదయం 9:30 గంటలకు రాజ్‌భవన్‌ ప్రాంగణంలోనే యడ్డీ సీఎంగా ప్రమాణం చేయనుండగా…ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా తదితర ముఖ్యులు హాజరవుతారని తెలుస్తోంది. 
బలం నిరూపించుకున్నాకే మంత్రివర్గం కూర్పు పై దృష్టి సారించనున్నారు యడ్యూరప్ప. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 10 రోజుల్లోనే అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ ఆయనకు సూచించారు. ఆ తర్వాతే మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని చెప్పడంతో ఆ కసరత్తు చేస్తోంది బీజేపీ. ఇప్పటికే కొందరిని డబ్బులతో కొనేసినట్లు తెలుస్తోంది. రూ.100 కోట్లకు ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు చేశారనేది బీజేపీ పై వచ్చే ఆరోపణ. అది నిజమని నిరూపిస్తే దేనికైనా సిద్దమని బీజేపీ ప్రకటించింది. ఫలితంగా మాటల తూటాలు పేలుతున్నాయి. గవర్నర్‌ నిర్ణయంతో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటగా..మరోవైపు కాంగ్రెస్, జేడిఎస్ ల కూటమి ఆందోళనకు సమాయత్తమవుతోంది. ఫలితంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకునే వీలుంది. 
224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ 104 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌(79), జేడీఎస్‌(38) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక బీఎస్పీ(1), ఇండిపెండెంట్లు(2) సీట్లను గెలుచుకున్నారు. సాధారణ మెజారిటీ(112)కి బీజేపీకి 8 సీట్ల దూరంలో నిలిచింది. జేడీఎస్‌-కాంగ్రెస్‌లు జతకట్టి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ముందుకొచ్చాయి. ఇరు పక్షాలతో మాట్లాడిన గవర్నర్‌ చివరికి బీజేపీకే అవకాశం ఇవ్వడంతో ప్రధాని మోదీ తీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
గోవాలో మెజార్టీ ఉన్పటికీ బీజేపీదే అధికారం. మణిపూర్ లోను అదే తీరు. ఇప్పుడు కర్నాటకలో కూటమికే మెజార్టీ సీట్లు ఉన్నప్పటికీ బీజేపీ మార్క్ రాజకీయం చూపించనట్లు అయింది. మొత్తంగా 22 రాష్ట్రాల్లో బీజేపీ కాలు పెట్టినట్లు అయింది. ఇంకోవైపు కాంగ్రెస్ కు కేవలం రెండు రాష్ట్రాలు నిలిచాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*