బెంగళూరులో కాంగ్రెస్ దే హవా

కర్ణాటకలో కాంగ్రెస్‌ వ్యతిరేక పవనాలు వీచాయి. కానీ రాజధాని బెంగళూరులో అది పని చేయలేదు. కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో హస్తం పార్టీదే పై చేయి అయింది. బెంగళూరులోని మొత్తం 28 నియోజకవర్గాలకు 26 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 13 స్థానాల్లో కాంగ్రెస్, 11 చోట్ల బీజేపీ, రెండు స్థానాల్లో జేడీఎస్‌ గెలుపొందింది. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 13 సీట్లు, బీజేపీ 12, జేడీఎస్‌ మూడు సీట్లు వచ్చాయి. గతంలో కంటే బీజేపీ ఒక సీటు కోల్పోగా…కాంగ్రెస్ తన సీట్లను దక్కించుకుంది. ఇక జేడీఎస్ ఒక సీటును పెంచుకుని..మూడుకు చేరింది. 
బెంగళూరులో 54 శాతం పోలింగ్‌ నమోదు అయింది. అతి తక్కువ అదే కావడం విశేషం. ఇక్కడ హోం మంత్రి రామలింగారెడ్డి (కాంగ్రెస్‌) 28 వేల మెజారిటీతో  బీటీఎం లేఔట్‌ నుంచి విజయం సాధించగా.. మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్‌.అశోక్‌ (బీజేపీ) అత్యధికంగా 32 వేల మెజారిటీతో పద్మనాభ నగర్‌ నుంచి గెలుపొందారు. జయనగర, రాజరాజేశ్వరినగరలో ఎన్నికలు వాయిదా పడటంతో అక్కడ ఎలాంటి హడావుడి లేదు. బీజేపీకి వ్యతిరేకంగా పట్టణ ఓటర్లు మొగ్గు చూపారని ఈ ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. పెద్ద నోట్ల మార్పిడి, జిఎస్టీ వంటి విషయాలను వారు వ్యతిరేకిస్తున్నారు. మేధావులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని..అందుకే వారి ఓటింగ్ శాతం తగ్గడమే కాదు..బీజేపీకి వ్యతిరేకంగా ఉందనే ప్రచారం సాగుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*