రికార్డ్ : బాబు, కేసీఆర్‌, జ‌గ‌న్‌, క‌న్నా…అంతా ఒకే తాను ముక్కలు

ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన భావాలు….రాజకీయాల ప‌రంగా బ‌ద్ధ‌శ‌త్రువులు అయిన న‌లుగురు ప్ర‌ముఖ నేత‌లు క‌లిసి సృష్టించిన అరుదైన రికార్డ్ ఇది. తెలుగు గ‌డ్డ‌పై ప‌రిచ‌యం అవ‌సరం లేని ఆ నాయ‌కులు వేర్వేరు ప్రాంతాల్లో….పార్టీల్లో….హోదాల్లో ఉన్న‌ప్ప‌టికీ వారిలో ఉన్న ఏకైక పోలిక ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఆ న‌లుగురు నాయ‌కులు ఎవ‌రంటే ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి,ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఈ న‌లుగురు నేత‌లు ప్ర‌స్తుతం వివిధ సిద్ధాంతాల‌ను అనుస‌రించే పార్టీల్లో ఉన్న‌ప్ప‌టికీ వీరి మూలం కాంగ్రెస్ పార్టీయే కావ‌డం ఈ అరుదైన అంశం. 
న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన నారా చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ జీవితం ప్రారంభ‌మైంది కాంగ్రెస్ పార్టీలోనే. పార్టీ యువ‌నేతగా ఉన్న బాబు అనంత‌రం త‌న రాజ‌కీయ వేదిక‌ను  మార్చుకొని త‌న మామ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరారు. ఆ పార్టీని వివిధ కార‌ణాల వ‌ల్ల భుజాన వేసుకొని ర‌థ‌సార‌థిగా మారారు. ఇక ఆయ‌న జూనియ‌ర్ అయిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ జీవితం ప్రారంభం అయింది కాంగ్రెస్‌లోనే. యువ‌జ‌న కాంగ్రెస్ నాయ‌కుడిగా ఉన్న ఆయ‌న టీడీపీ చేరి అనంత‌రం టీఆర్ఎస్‌ను స్థాపించి ప్ర‌స్తుతం ఆ పార్టీ ర‌థ‌సార‌థిగానే కాకుండా రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పొలిటిక‌ల్ కెరీర్ మొద‌ల‌యింది సైతం గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా అయిన కాంగ్రెస్ పార్టీలోనే. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వార‌సుడిగా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన జ‌గ‌న్ అనంత‌రం పార్టీతో విబేధించి సొంత పార్టీని పెట్టుకొని ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షనేత స్థాయికి ఎదిగారు. ఇక ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారిన బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయ జీవితం కాంగ్రెస్‌లోనే మొద‌లైంద‌నే సంగ‌తి తెలిసిందే. ఇలా నలుగురు ప్ర‌ధాన నాయ‌కులు…నాలుగు పార్టీల ర‌థ‌సార‌థుల మూలాలు కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండ‌టం కాక‌తాళీయ‌మే.అయితే అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ త‌న‌ క‌ళ‌ను కోల్పోతుండ‌టం కాలం మ‌హిమే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*