క్యాంప్ రాజకీయాలు

కర్నాటకలో ఎవరికి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టలేదు ఓటర్లు. ఫలితంగా అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా క్యాంప్ రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విడిగా పోటీ చేసినా..కాంగ్రెస్, జేడీఎస్ లు కూటమిగా ఏర్పడటం బీజేపీని కలవరానికి గురి చేసింది. హఠాత్తుగా వారిద్దరు కలవడం వెనుక సోనియా రాజకీయ చతురత ఉంది. అయినా సరే ఆ కూటమికి అంత తేలికగా అధికారం దక్కనిచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఫలితంగా ఇప్పుడు కర్నాటకలో రిసార్టు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఫలితాలకు ముందే కుమారస్వామిని తమకు అనుకూలంగా మలచుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఒకవేళ హంగ్ వస్తే తమకు మద్దతునివ్వాలని కుమారస్వామి కోరగా..హస్తం పార్టీ అందుకు ఒప్పుకుంది. బీజేపీకి సిఎం సీటు ఇవ్వకపోతే చాలు. మీరైనా ఏలండిని చెబుతోంది. అది జేడీఎస్ కు నచ్చింది. 
అంతే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తామని కుమారస్వామి ముందుకు వచ్చారు. ఇక అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటే జేడీఎస్‌ను చీల్చాల్సిందే. మరో దారి లేేదు. అందుకే తన ఎమ్మెల్యేల్ని జేడీఎస్‌ ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటోంది. ఇంకోవైపు కాంగ్రెస్‌ కూడా తన ఎమ్మెల్యేలు చేజారకుండా అప్రమత్తమైంది. నేతలంతా అందుబాటులో ఉండాలని చెబుతోంది. కొందరిని ఇప్పటికే క్యాంప్ లకు తరలించే పని చేసింది. 2004లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఇలానే క్యాంప్ రాజకీయాలు చోటు చేసుకున్నాయి. అప్పుడు బీజేపీకి 90, కాంగ్రెస్‌కు 65, జేడీఎస్‌కు 58 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీలు చీల్చకుండా జేడీఎస్‌ చాలా జాగ్రత్త పడింది. అప్పుడు జేడీఎస్ ఎమ్మెల్యేల్ని బెంగళూరు శివారులోని రిసార్ట్‌కు తరలించింది. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరాకే.. జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రిసార్టు నుంచి బయటకు వచ్చారు. 
కాంగ్రెస్‌కు మద్దతు ఉపసంహరించున్న జేడీఎస్ 2006లోను అదే పని చేసింది. గోవాలోని ఓ రిసార్టులో వారిని ఉంచింది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 110 స్థానాలు దక్కినా చివరకు గాలి జనార్దన్‌ రెడ్డి నేతృత్వంలో స్వతంత్ర అభ్యర్థుల్ని రిసార్టులకు తరలించాల్సి వచ్చింది. దాదాపు ఇప్పుడు అంతే. కన్నడ ఓటర్లు స్పష్టమైన తీర్పు ఎప్పుడు ఇవ్వడం లేదు. ఈ సారి జేడీఎస్ లోనే చీలిక తెచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తమ్ముడు కుమారస్వామి ఒకవర్గంగా ఉంటే..అన్న రేవణ్ణ మరో వర్గంగా ఉన్నారు. తండ్రి దేవెగౌడ ఇద్దరినీ ఏకం చేసే పని చేస్తున్నారు. మనకు అధికారం రాకపోయినా పర్వాలేదు. కానీ మీరిద్దరు వేరు కావద్దని కొడుకులను కోరుతున్నారు.
 కుమారస్వామికి కాంగ్రెస్ సిఎం పదవి ఇస్తానంది. కానీ జేడీఎస్‌ను చీలిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని రేవణ్ణకు బీజేపీ ఆఫర్ చేసింది. ఫలితంగా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకుంది. రేవణ్ణతో పాటు మరో 12 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నట్లు కర్ణాటక బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప గవర్నర్‌కు ఇచ్చిన నివేదికలో చెప్పారని తెలుస్తోంది. అదే నిజమైతే జేడీఎస్ లో చేలిక వచ్చినట్లే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*