ఆ ఒక్క లాజిక్‌తోనే బీజేపీ స‌ర్కార్ ఏర్పాటు చేస్తుంద‌ట‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్ప‌టికీ…ఆ రాష్ట్రంలో ఏం జ‌ర‌గ‌నుంద‌నే ఉత్కంఠ‌కు తెర‌ప‌డని సంగ‌తి తెలిసిందే. అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలు గెలుచుకోలేకపోయింది. హంగ్ అసెంబ్లీ నేపథ్యంలో కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, జేడీఎస్ అంగీకరించాయి. అయితే కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) జట్టు కట్టడం ఊహించిన పరిణామమేనని విశ్లేషకులు చెబుతున్నారు. త‌మ‌ను అదికారానికి దూరం చేస్తున్న కాంగ్రెస్‌కు షాకిచ్చేందుకు ఇప్ప‌టికే బీజేపీ స్కెచ్ వేసింద‌ని చెప్తున్నారు.
గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో గోవా, మణిపూర్ రాష్ర్టాల్లో రెండో స్థానంలో నిలిచినా చిన్న పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా కర్ణాటకలో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అదే వ్యూహాన్ని అమలు చేయ‌నుంద‌ని స‌మాచారం. జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిస్తామని కాంగ్రెస్ ప్రకటించన‌ప్పటికీ…బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ జేడీఎస్ కూటమికి రాజ్యాంగ బద్ధత లేద‌నే లాజిక్‌తో ఆ పార్టీ ముందుకు సాగ‌నుంద‌ని స‌మాచారం. అదే స‌మ‌యంలో జేడీఎస్‌ను చీల్చేందుకు కూడా బీజేపీ ఏమాత్రం వెనుకాడ‌బోద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. వివిద విర్గాల అంచ‌నాల ప్ర‌కారం ఇంతకుముందు గోవా, మణిపూర్‌ల్లో అనుసరించిన వ్యూహాన్ని కర్ణాటకలోనూ కమలనాథులు అనుసరించనున్నారు. అయితే కర్ణాటకలో పరిస్థితి విభిన్నంగా ఉన్నదని ఆ పార్టీ నేతలే  అంటున్నారు.
60 స్థానాలు గల మణిపూర్‌లో కాంగ్రెస్ 28, బీజేపీ 21 స్థానాల్లో గెలుపొందాయి. కానీ చిన్న పార్టీల మద్దతుతో మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 35.1 శాతం ఓట్లు పొందితే, బీజేపీకి 36.2 శాతం ఓట్లు లభించాయి. ఇక గోవాలోనూ 40 స్థానాలకు కాంగ్రెస్ 17, బీజేపీ 13 సీట్లలో గెలుపొందాయి. కానీ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీల మద్దతుతో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. గోవాలో గవర్నర్ పాత్రపై అప్పట్లో కాంగ్రెస్ నిరసన తెలిపింది. ఈ నేప‌థ్యంలోనే ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ.. జేడీఎస్‌కు ఎలా మద్దతునిస్తుందని బీజేపీ ప్రశ్నిస్తున్నది. గోవా, మణిపూర్‌లో బీజేపీ అనుసరించిన వ్యూహాన్ని గుర్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. ఓ వైపు ఇలా కౌంట‌ర్ ఇస్తూనే… మ‌రోవైపు జేడీఎస్ రూపంలోనే మ‌ద్ద‌తు పొందే ఎత్తుగ‌డ‌ల‌ను బీజేపీ వేస్తోంద‌ని వివ‌రిస్తున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*