తెలంగాణలో విపక్షాలు ఏకమవుతున్నాయి…

తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా మిగతా పార్టీలు ఏకమవుతున్నాయి. ఇటీవల కాలం వరకు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించిన పార్టీల నేతలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయి. సిపిఐ, సిపిఎంలు చేరో దారి చూసుకుంటున్న సంగతి తెలిసిందే. అలా అయితే అధికార పార్టీని ఓడించలేమనే ఆలోచనకు వచ్చారు. అందుకే తెలంగాణ జనసమితితో పొత్తు కోసం ఆయా పార్టీలు ఆసక్తిగానే ఉన్నాయి. టిజెఎస్ తో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఇంకోవైపు చాడా వెంకటరెడ్డి అదే మాట చెప్పారు. సిపిఎం మిగతా పార్టీలను ఏకం చేస్తోంది. దానికి బహుజన ఫ్రంట్ అనే పేరు పెట్టింది. ప్రజా సంఘాలు, జేఏసీ, కుల సంఘాలను ఇందులో చేర్చింది. ఈ కూటమిలోకి ఇప్పుడు కోదండరామ్ పార్టీ చేరనుంది. 
ఫలితంగా వచ్చే ఎన్నికల్లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ 119 స్థానాల్లో పోటీచేయనుంది. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామిలలో ఏ ఒక్కటి అమలు కాలేదనే సంగతిని ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. బంగారు తెలంగాణ అతని వల్ల రాదని తేల్చిసింది. 2019లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా మిగతా పార్టీలు పావులు కదుపుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రజల బతుకులు మార్చడానికి ఏ మాత్రం కృషి చేయలేదనేది వారి ఆలోచన. అందుకే కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకోమని తెలిపారు. తెలంగాణలోని చిన్న చితకా పార్టీలన్నీ కలిపి ఏకం చేస్తే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతోంది. కాకపోతే కాంగ్రెస్, టీఆర్ఎస్ కు ఉన్న ఆర్థిక వనరులు, క్యాడర్ ఆయా పార్టీలకు లేదు. ప్రకటనలకే పరిమితమవుతుందా.. లేక నిజంగా తమ సత్తా చాటుతుందా అనేది చూడాలి. ఒక్కో నియోజకవర్గంలో గెలవాలంటే కనీసం రూ. 20 కోట్లకు తక్కువ ఖర్చు కాదు. అంత డబ్బులు పెట్టుకునే ఆర్థిక స్థోమత బహుజన ఫ్రంట్ కు లేదు. కాబట్టి గెలుపు అంత తేలిక కాదంటున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు తెలంగాణలో ఉంది కేవలం రెండే సీట్లు. కాబట్టి ఆ సీట్లను పెంచుకుంటే చాలు అంటున్నాయి మిగతా పార్టీలు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*