సిద్దు సంచనలం…దళితుడ్ని సిఎం చేస్తే…

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో రానున్నాయి. ఈ లోపే సీఎం సిద్ధరామయ్య నైరాశ్యంలో మునిగారు. ఇక అధికారానికి రానని భావించారు. అందుకే సంచలన ప్రకటన చేశారు. దళితుణ్ని సీఎం చేస్తామంటే… ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్‌లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని వచ్చాయి. అందుకే సిద్దరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జేడీఎస్‌తో పొత్తు కుదుర్చుకోక తప్పదనే సంకేతాలు వస్తున్న సమయంలో సిద్దరామయ్య చేసిన ప్రకటన కర్నాటకలో హట్ టాపికైంది. 

తెలంగాణ ఇస్తే దళితుడ్ని సిఎం చేస్తానని గతంలో కేసీఆర్ చేసిన కామెంట్. దేశ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఆచరణలో కేసీఆర్ ఇందుకు విరుద్దంగా వ్యవహరించారు. కాకపోతే డిప్యూటీ సిఎం పదవిని రెండు సార్లు దళితుడికే ఇచ్చి తన మాటను కొంత వరకు నిలబెట్టుకున్నారని చెప్పాలి. ఇప్పుడు సిద్ద రామయ్య అదే మాట చెబుతున్నాడు. తనకు ఎలాగు అధికారం రాదనే ఆలోచనతో దళితుడిని సీఎం చేసేందుకు తాను పదవీ త్యాగం చేయడానికి సిద్ధమన్నారు. తానే మళ్లీ సిఎం అవుతానని నిన్న ధీమాగా చెప్పిన సిద్ధరామయ్య ఇక రాజకీయాల నుంచి వైదొలిగే ఆలోచన చేస్తున్నారు. 

తనకు ఇవే చివరి ఎన్నికలని చెప్పారు. ఆ తర్వాత సీఎం పదవి త్యాగం చేస్తాననడంపై కమలనాథులు జోకులు పేలుస్తున్నారు. సిద్ధరామయ్య ఓటమిని అంగీకరించినట్లేనని చెబుతున్నారు. మెజార్టీ సర్వేలు సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాదని తేల్చాయి. బాదామి, చాముండేశ్వరి నుంచి పోటీ చేసిన సిద్ధూ… రెండు స్థానాల్లోనూ ఓడిపోయే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బళ్లారి నేత శ్రీరాము బాదామిలో సిద్దరామయ్యపై గెలుస్తారని చెబుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ తెలుసుకున్న సిద్దు ఒక నిర్ణయానికి వచ్చారంటున్నారు. 

సింగపూర్ లో కుమారస్వామి…
హంగ్ ఏర్పడే అవకాశం ఉండటంతో మరోవైపు జేడీఎస్ నేత కుమార స్వామి విదేశాలకు వెళ్లారు. ఆయన సింగపూర్‌ వెళ్లడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీలతో బేరసారాలు ఆడేందుకే ఆయన విదేశాలకు వెళ్లారన్న వాదన వస్తున్నాయి. తమకు రెండు పార్టీలు తమకు సమానమే అని కుమారస్వామి ఇప్పటికే ప్రకటించారు. కానీ ఆయన మూత్రపిండాల వ్యాధికి చికిత్స తీసుకోడానికే సింగపూర్‌కు వెళ్లాడని ఆ పార్టీ నేతలు చెబపుతున్నారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ మాత్రం ఈ నెల 15న పూర్తి ఫలితాలు వచ్చేవరకూ తాను దీనిపై ఏమీ మాట్లాడబోనని చెప్పేశారు. ఫలితంగా అంతా ఇప్పుడు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*