ఆ నేతలను చెప్పులతో కొట్టాలట

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం రైతు బంధు. ఎకరాకు రూ.8వేలను రైతులకు ఇస్తోంది సర్కార్. మొత్తం రూ.14 వేల కోట్లను ఇందుకు కేటాయించింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు వచ్చినంత పేరు వస్తోంది. ఇది విపక్షాలకు కంటగింపుగా మారింది. అంతే రైతు బంధు పథకం ద్వారా వచ్చిన డబ్బులతో రైతు మద్యం సేవిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పుల్ గా తాగాలని కేసీఆర్ సర్కార్ డబ్బులు ఇస్తుందని విమర్శించారు హస్తం నేతలు. అది కాస్త ముదిరిపాకాన పడింది. కేసీఆర్ తాగుబోతు. తాగినప్పుడు ఒక మాట. దిగిన తర్వాత మరో మాట మాట్లాడతారని ఇప్పటికే రేవంత్ రెడ్డి వంటి వారు ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో రైతు బంధు పథకం పేరుతో రైతులను తాగుబోతులుగా చెప్పడాన్ని తప్పుపడుతోంది అధికార పార్టీ.  
రైతు బంధు పథకాన్ని విమర్శించే కాంగ్రెస్ నేతలను రైతులు చెప్పులతో కొట్టాలని మంత్రి జగదీస్ రెడ్డి పిలుపు ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలో రైతుబంధు పథకం చెక్కులను పంపిణీ చేసిన ఆయన ఈ మాటలన్నారు. ఫలితంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల మంటలు రేగాయి. గ్రామాలలో కాంగ్రెస్ నేతలను తరిమికొట్టాలని ఆయన అన్నారు. రైతుబంధు పథకం రైతులను ఎంతగానో ఆదుకుంటుంటే, ప్రతిపక్షాలు, నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. రైతు బంధు డబ్బుతో మద్యం సేవించే దృశ్యాలు ఉంటే చూపించాలంటున్నారు మంత్రి. కాంగ్రెస్ కాలంలో ఆ రైతులకు కనీసం తినేందుకు, తాగేందుకు నీళ్లు ఇవ్వలేదని.. ఇప్పుడు ఇస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడటం పద్దతి కాదని హెచ్చరించారు మంత్రి జగదీష్ రెడ్డి. 
సిఎం కేసీఆర్ పై వ్యతిరేకత పెరుగుతోంది. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ చేతులెత్తేసింది. ఈ సారి అలా కాకుండా ఉండాలంటే ఎదురుదాడే మార్గమని ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అసలు ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగంలా మారింది కాంగ్రెస్ తీరు. ఎవరికి వారే తాము సిఎం రేసులో ఉన్నట్లు ప్రకటించుకుంటున్నారు. డికే అరుణ, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వంటి వారు సిఎం రేసులో ఉన్నామంటున్నారు. ఇస్తే తీసుకుంటామని చెబుతున్నారు. అసలు ఎన్నికలే లేవు. అధికారం రాలేదు. 
అప్పుడే సిఎం కుర్చీ కోసం కోట్లాడుతుంటే ఇక అసలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*