అద్భుతమైన క్షణాలను మిస్ అయిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నేడు మధురమైన క్షణాలను మిస్ అయ్యారు. ఆదివారం మాతృదినోత్సవం అన్న సంగతి అందరికీ తెలిసిందే. మాతృ దినోత్సవం సందర్భంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు వాళ్ల అమ్మగారైన అంజనాదేవి దగ్గర ఆశీస్సులు పొందారు. కోట్లాదిమంది అభిమానించే మెగాస్టార్ అయినా.. అమ్మ అంజనాదేవికి మాత్రం గారాల బిడ్డే!

అందుకే మెగాస్టార్ చిరంజీవి.. ఇవాళ (ఆదివారం) ‘మదర్స్ డే’ సందర్భంగా అమ్మ పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. తన తమ్ముడు నాగబాబు, ఇద్దరు సోదరీమణులతో కలిసి, తల్లి అంజనాదేవీకి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నుంచి ఆశీస్సులు అందుకున్నారు. తన అయిదుగురు పిల్లల్లో పవన్ కళ్యాణ్ అంటేనే ఆ మాతృమూర్తికి ఎంతో ఇష్టం. అయితే పవన్ తిరుమలలో ఉండడం వల్ల అమ్మను కలుసుకోలేకపోయారు. తన సోదరసోదరీమణులు పొందిన అద్భుతమైన క్షణాలను పవన్ కల్యాణ్ మిస్ అయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*