చిరంజీవికి కోపం వచ్చిన వేళ

మహానటి మూవీ అందరికీ నచ్చింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బయోపిక్ లను జనం ఆసక్తిగా చూస్తున్నారు. ప్రముఖుల జీవితాల వెనుక ఉన్న కథలను తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటోంది. అందులోను మహానటి సావిత్రిని చూసేందుకు వారు ఉత్సాహం చూపుతున్నారు. ఫలితంగా సూపర్ హిట్ అయింది మహానటి. కీర్తి సురేష్ నటన అద్భుతం. అందుకే మహానటి ‘యూనిట్‌ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ సినిమా చూసినంత సేపు భావోద్వేగానికి గురయ్యానని, కళ్ళు చెమర్చాయని, గుండె బరువెక్కిందని చెప్పారు.  చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్‌లతో పాటు… దర్శకుడు నాగ్ అశ్విన్‌ను తన ఇంటికి ఆహ్వానించి మపీ పట్టు శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు.
సావిత్రి తన అభిమాన నటి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది అనే కంటే జీవించింది అనడం కరెక్ట్ అన్నారు చిరంజీవి. దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ మాదిరే అద్భుతంగా నటించాడని పొగిడారు. తన తర్వాత చిత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఉంటుందని చిరంజీవి ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. సినిమా తీసే విధానం నచ్చిందని.. అందుకే నాగ్ అశ్విన్ ను మెచ్చుకున్నారు చిరు. తన సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తుందని చెప్పారు చిరంజీవి. నాటి ‘ పాతాళభైరవి‘ సినిమా తరహాలో ఈ ప్రాజెక్టు ఉండబోతోందని, టైం మిషన్ నేపథ్యంలో సాగే కథ ఇదని చెప్పకనే అసలు సంగతి చెప్పారు చిరంజీవి. 
మరోవైపు వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీ దత్ ను చిరంజీవి సత్కరించారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాం చరణ్ నిర్మాణంలో వస్తున్న ‘ సైరా నరసింహా రెడ్డి‘ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా తీయనున్నారు. 
చిన్న మచ్చ
మహానటి టీమ్ ను అభినందిచాక మీడియాతో మాట్లాడారు చిరంజీవి. ఆ సమయంలో చిరంజీవికి కోపం పెరిగింది. ఒక దశలో పట్టలేనంత ఆగ్రహావేశానికి లోనయ్యారు. ఒక రిపోర్టర్ పై డిస్టర్బ్ చేస్తున్నావ్.. అంటూ చేతి వేలు చూపించి మరీ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. చిరంజీవి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిరు పిలిస్తే వచ్చాం. ఇలా వేలు ఎత్తి చూపించడం బాగోలేదంటున్నారు. మీడియా వారంటే పిచ్చి పుల్లయ్యలా చూస్తున్న చిరంజీవి ఎప్పటికి తెలుసుకుంటారోనని అంటున్నారు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*