క‌ర్నాట‌క త‌రువాత ఇక ఏపీనే ల‌క్ష్యం…

దేశ వ్యాప్తంగా మోదీ గాలి వీస్తోంది. క‌ర్నాట‌క‌లో కూడా బీజేపీకి అధికారం వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని కొన్ని స‌ర్వేలు తేల్చి చెబుతున్నాయి. కాంగ్రెస్ కూడా గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని మ‌రికొన్ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఫ‌లితాలు ఎలాగున్నా బీజేపీ మాత్రం ద‌క్షిణాదిపై త‌న ప‌ట్టు సాధించుకునే ప‌నిలో ప‌డింది. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఏపీని ల‌క్ష్యం చేసుకోవాల‌ని బీజేపీ అధిష్ఠానం ఇప్ప‌టికే నిర్ణ‌యించింద‌ట‌. అందుకే అమిత్‌షా ఏపీలో గ‌తంలో రెండు మార్లు ప‌ర్య‌టించారు. తాజాగా తిరుప‌తి కూడా వ‌చ్చి పోయాడ‌న్న‌ది పొలిటిక‌ల్ టాక్‌. ఏపీలో అధికారం చేప‌ట్ట‌డానికి ఎంత‌కైన తెగించాల్సిందేన‌ని నాయ‌కులకు అధిష్టానం నూరిపోస్తుంది. ఈ నేప‌థ్యంలో ఏపీలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ పెట్టాల‌ని టీడీపీ, వైసీపీల నుంచి బ‌ల‌మైన నాయ‌కుల‌ను లాగేందుకు బీజేపీ నాయ‌కులు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని రాజ‌కీయ‌నాయ‌కులు కూడా స్ప‌ష్టం చేస్తున్నారు. బీజేపీ ఏపీలో పాగా వేసేందుకు ఎంత‌కైన తెగించేలా ఉంద‌ని వైసీపీ నేత స‌బ్బం హ‌రి అంటున్నారు. క‌ర్నాక‌ట ఎన్నిక‌ల కార‌ణంగా బీజేపీ ఇన్ని రోజులు వేచిచూసే దోర‌ణితో వ్య‌వ‌హ‌రించింద‌ని, కాని ఇక ఆగ‌దు అనేది ఢిల్లి నుంచి వ‌స్తున్న స‌మాచారం మేర‌కు స్ప‌ష్టం అవుతుంద‌ని ఆయ‌న అంటున్నారు. మ‌రికొంతమంది నాయ‌కులు కూడా ఇదే అంటున్నారు. క‌ర్నాట‌క‌లో ఓడినా, గెలిచినా ఏపీలో మాత్రం బీజేపీ త‌న ప‌ట్టు సాధించుకునేందుకు ప్ర‌య‌త్నాలు మాత్రం ఆపేలా క‌నిపించ‌డం లేద‌ని టీడీపీ సీనియ‌ర్ నేత ఒక‌రంటున్నారు. నాయ‌కులు ఇంత గ‌ట్టిగా చెబుతున్నారంటే ఇప్ప‌టికే బీజేపీ ఏపీలో కొంత మంది నేత‌ల‌ను క‌దిలిచ్చి ఉంటుంద‌ని నాయ‌కులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. నిజంగానే బీజేపీలోకి వ‌ల‌స‌లు పెరిగితే మాత్రం టీడీపీ.. వైసీపీలు కొంత విప‌త్క‌ర‌ ప‌రిస్థితులు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*