రేవంత్‌రెడ్డి తీరుకాంగ్రెస్‌ను క‌ల‌వ‌ర‌పెడుతుందా…

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం  రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి తానే దిక్కు అన్న‌ట్టు రేవంత వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని సొంత‌పార్టీకి చెందిన నాయ‌కులే అంటున్నారు. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు  సీనియర్లు ఫైర్ అవుతున్నారు. శాసనసభా సభ్యత్వం రద్దు తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లకు దీక్ష చేయమని సలహా ఇచ్చింది తానే అని చెప్పడంపై తీవ్ర‌ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్‌ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను ఉపయోగించుకుంటే బంగారం లేదంటే మన్ను అంటూ ఆయన రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి సెటైర్ వేశారు. అలా అయితే టీడీపీలోనే ఉండి ఆ పార్టీనే బంగారం చేసుకోవాల్సిందని అన్నారు.ఇక పొంగులేటి సుధాక‌ర్ కూడా రేవంత్ వ్య‌వ‌హారం పై సీరియ‌స్‌గా ఉన్నాడు.   ఉత్తమ్ కుమర్ రెడ్డి తనను పట్టించు కోవడం లేదని, ఆయనకు సరైన సలహాదారులు లేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌ను పొంగులేటి త‌ప్పుప‌ట్టారు. రెవంత్‌ రెడ్డికి రాహుల్ గాంధీ చాలా హామీలు ఇచ్చారని ఇంత కాలం భావిస్తూ వచ్చారు. కానీ ఆయనకు రాహుల్ గాంధీ ఏ విధమైన హామీ ఇవ్వలేదని సుధాకర్ రెడ్డి ఓ మీడియా స‌మావేశంలో చుర‌క అంటించారు. ఎవరు కూడా షరతులు పెట్టి పార్టీలో చేరలేదని, సహనం వహించాలని, నాయకుల కన్నా పార్టీ ముఖ్యమని సుధాకర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి లేవనేత్తిన అంశాలపై పార్టీ కోర్ కమిటీ చర్చిస్తుందని కూడా ఆయన చెప్పారు. రేవంత్ ను సీనియ‌ర్లు టార్గెట్ చేయ‌డం పార్టీలో చ‌ర్చ‌ణీయాంశంగా మారింది. ఎన్నిక‌ల‌కు ముందే రేవంత్‌, సీనియ‌ర్ల మ‌ధ్య వార్ జ‌రిగితే ఓట‌ర్లు ఎలా న‌మ్ముతార‌ని పార్టీ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*