ఆ డైరెక్టర్ అంతు చూస్తానంటున్న పూనమ్ కౌర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వివాహం చేసుకునేందుకు హీరోయిన్ పూనం కౌర్ సిద్దపడిందంటారు. ఇందు కోసం పూనమ్ కౌర్ తో పాటు..పవన్ కల్యాణ్ పూజలు చేశారనే ప్రచారం జరిగింది. కత్తి మహేష్ లాంటి వారు పూనం కౌర్ కు గతంలో ఇవే ప్రశ్నలు వేశారు. కానీ దేవుడు వరమిస్తే పూజారి అడ్డుపడినట్లు..ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వారి వివాహానికి అడ్డు తగిలాడనే వాదన లేకపోలేదు. ఇది నిజమా..కాదా అనేది ఎవరికీ తెలియదు. కానీ పవన్ కల్యాణ్ మీద కత్తి మహేష్ మాటల దాడి చేస్తే అడ్డుకునేందుకు పూనమ్ కౌర్ ప్రయత్నించింది. చివరకు ఆమె ఇరుక్కుపోయింది. పవన్ కల్యాణ్ అంటే ప్రేమ కనపరిచింది ఆ భామ. ఆ తర్వాత పవన్ కు వ్యతిరేకంగా పరోక్షంగా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. లోపల ఒకటి చెబుతారు. బయటకు మరొకటి చెబుతారు. పేరుకు హీరోలు. కానీ వారి మనసులో చాలా తేడా ఉంటుందని పూనమ్ చెప్పిన మాట. 
ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ పూనమ్‌కౌర్ తిరిగి రంగంలోకి వచ్చింది. ఈ సారి టాలీవుడ్ దర్శకుడి పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో ఓ దర్శకుడు వున్నాడు.. అతడు సినిమాలనే కాదు, మనుషులను కూడా డైరెక్ట్ చేస్తుంటాడు. నన్ను కూడా డైరెక్ట్ చేయాలని చూశాడు.. నేను మాత్రం తప్పించుకున్నానని చెబుతోంది. దీనిపై అతడ్ని వివరణ కోరితే ఏమీ తెలీనట్టు యాక్టింగ్ చేశాడని, ఆయనకి సంబంధించిన అమ్మాయిలే ఇండస్ట్రీలో వుండాలని కోరుకుంటాడని మరో బాంబు పేల్చింది. సినీ పరిశ్రమలో జరుగుతున్న ఓ విషయాన్ని పూనమ్ ప్రస్తావించింది. ఆ దర్శకుడు ఎవరు, పేరు ఏంటి..ఆయన ఏం సినిమాలు చేశాడు వంటి వివరాలను చెప్పలేదు. అయినా సరే అతను త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అనుమానిస్తున్నారు మిగతా వారు. ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో ఇదే విషయం పై చర్చ జరుగుతోంది. 
There is this director who just doesnt films but life’s of people …he tried directing mine n did quite manipulate it …the time I asked for explanation he behaved as if nothing happend , he wants only his girls to b therein this industry
… Poonam Kaur Lal (@poonamkaurlal) May 10, 2018

1 Trackback / Pingback

  1. ఆ డైరెక్టర్ అంతు చూస్తానంటున్న పూనమ్ కౌర్ – Today News Hub

Leave a Reply

Your email address will not be published.


*