రాజకీయ పిచ్చి ముదిరితే…ఇలానే

రాజకీయ పిచ్చి ముదిరింది. అది కాస్త మాటల రూపంలోకి వచ్చింది. ఫలితంగా మనుషులు దేవుళ్లుతో పోలుస్తున్నారు. బీజేపీలోని నేతలను దేవుళ్లతో పోల్చడం కొత్తేం కాదు. ఉత్తరప్రదేశ్ బిజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ప్రధాని మోడీని రాముడితో పోల్చాడు. అంతటితో ముగియలేదు. రాముడుతో పాటు..పక్కనే ఉన్న లక్ష్మణుడు అమిత్ షా అని చెప్పాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. యుగ పురుషుడు శ్రీరామచంద్రుడి రూపంలో పునర్జన్మించారని ఆయన అన్నారు. బిజపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను ఆయనకు చేదోడు,వాదోడుగా నిలిచే వ్యక్తిగా చెప్పారు. పూర్వ కాలంలో మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్తుని ప్రధాన సలహాదారుడైన చాణుక్యునిగా పోల్చారు. వారినే కాదు…ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాద్ ను వదల్లేదు. యోగి హనుమంతుడని చెప్పారు. 
ఆంధ్రప్రదేశ్ లోను అలాంటి మాటలు చాలానే వచ్చాయి. అన్న ఎన్టీఆర్ ను యుగపురుషుడుతో తెలుగు తమ్ముళ్లు పోలుస్తారు. అలాంటి దేవుడు మరిక లేరంటారు. అంతగా తెలుగువారి మనసులో చెరగని ముద్ర పడ్డారాయన. జనసేన అభిమానులు, కార్యకర్తలు పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ను దేవుడుగా చూస్తారు. మా దేవుడు ఏం చెబితే అదే చేస్తామంటున్నారు వాళ్లు. అంతగా దేవుడు పేరు పాపులర్ చేశారు పవన్ అభిమానులు. సినిమాల ఆడియో వేడుకల్లోను మా దేవుడు వేదికమీదకు రావాలంటూ ఆహ్వానించడాన్ని చూస్తున్నాం. నాకొక పిచ్చి ఉంది. కానీ దానికో లెక్క ఉందంటారు పవన్ కల్యాణ్. కానీ యూపీలో ఎమ్మెల్యేలకు ఇలాంటి పిచ్చే ఉంది. కానీ లెక్కలేదు.
బతికున్న నేతలను దేవుళ్లతో పోల్చడం మాములు విషయం కాదు. ఆరాధించడం వేరు. అందరి ముందు ప్రజా ప్రతినిధిగా చెప్పడం వేరు. ఏదో అభిమానం కొద్ది చెబుతుంటారు. కానీ ఇలా నేరుగా ప్రజల ముందు చెప్పడంతో తెలుగు వారు వ్యతిరేకిస్తున్నారు. ఏపీకి ఆ దేవుళ్లుగా చెబుతున్న నేతలు అన్యాయం చేస్తున్నారనేది వారి మాటగా ఉంది.  

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*