రూటు మార్చిన ముద్రగడ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రూటు మారింది. ఏపీ సిఎం చంద్రబాబునాయుడుకు ఆయన రాసినన్ని లేఖలు మరొకరు రాసి ఉండరు. అంతగా ముద్రగడ బహిరంగ లేఖలు రాశారు. కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబును అడగటానికి ఇంకేం లేదు. వారికి రిజర్వేేషన్లు ఇచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం ఒప్పుకుంది. అసెంబ్లీలో అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఫలితంగా టీడీపీని తప్పు పట్టడానికి ఏం లేదు. 
2015 ఎన్నికల ప్రణాళికలోనే కాపు రిజర్వేషన్లను మ్యానిఫెస్టోలో పొందుపరిచింది టీడీపీ. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న ప్రభుత్వం మాదని ప్రస్తావించింది. మంజునాథ కమిషన్ 20 నెలల పాటు అన్ని జిల్లాల్లో తిరిగి వివరాలు సేకరించింది. అందుకే కాపుల కోసం రూ.2,100 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలను బీసీల్లో చేర్చాలని ప్రజలే కాదు..ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అసెంబ్లీలో ప్రస్తావించారు మంత్రి. రాష్ట్రంలో ఏ ఊరిలో, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో సమాచారం వచ్చింది. 
ఆంధ్రప్రదేశ్ లో కాపులు 38,09,362 మంది ఉన్నారు. వారిలో తెలగ 4,81,368 మంది, ఒంటరి 13,058, బలిజ 7,51,031 మంది ఉన్నారు. బీసీ కమిషన్ నివేదిక ప్రకారం కాపుల్లో 5.8 శాతం మంది గుడిసెల్లో ఉంటున్నారని తెలిసింది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కుటుంబాల్లో 69.3 శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. ఇక  కాపు, బలిజ, ఒంటరి తెలగల్లో కేవలం 5.6 శాతం మాత్రమే డిగ్రీ చదువుకున్న వారు ఉండటం ఆశ్చర్యమే. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ముద్రగడకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే ఇక ఏకంగా ప్రదాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. 
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అదికార దుర్వినియోగం, అవినీతిపై సిబిఐ దర్యాప్తు చేయించాలని ఆయన ఆలేఖలో ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో చంద్రబాబు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అన్నారు.‘అబద్ధాల ముఖ్యమంత్రి నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయినా అరెస్టు నుంచి కాపాడమని మీ కాళ్లే పట్టుకుంటే, మీరు కాపాడడం వల్లే ఇప్పుడు రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. మోడీ కాపాడం వల్లే చంద్రబాబు బతికిపోతున్నారనే కొత్త వాదన తెరపైకి తెచ్చారు ముద్రగడ. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం పనులను రాష్ట్ర పర్యవేక్షణలో చేయాలనే నిర్ణయం మంచిది కాదన్నారు ముద్రగడ. అందుకే అడ్డగోలుగా అవినీతి జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. ప్రకృతి ప్రసాదించిన ఇసుకను సైతం ఉచితం పేరుతో కోట్లాది రూపాయల్లో దోపిడీ చేస్తున్నారనేది ముద్రగడ ఆరోపణ. సీఎం అవినీతిపై సీబీఐ, ఇన్‌కంటాక్స్‌, ఈడీ ద్వారా దర్యాప్తు చేయించి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాలని ముద్రగడ డిమాండ్ చేశారు.
ముద్రగడ లేఖ రాసినా రాయకపోయనా ఏపీ విషయంలో కేంద్రం గుర్రుగా ఉంది. కానీ చన్నీళ్లకు వేడి నీళ్లు తోడైనట్లు మరింతగా రచ్చ చేసేందుకు ముద్రగడ ఊతం ఇస్తున్నారు. కర్నాటక ఎన్నికల తర్వాత ఏపీ పై కేంద్రం దృష్టి సారించనుంది. ఆ సంగతి తెలిసే ముద్రగడ లేఖ పేరుతో హడావుడి చేస్తున్నారంటున్నారు. ఎన్ని విచారణలు జరిపినా ఏం చేసిాన అదిరిదే, బెదిరేది లేదంటోంది మరోవైపు టీడీపీ.  

1 Comment

  1. CBN ni adurkoleka Pavan ni , Jagan ni , mudragada ni , IAS valani etc. sikhandulani modi , shah prayogistunaru. Chi,,,,, sigh Leda modi ……..

Leave a Reply

Your email address will not be published.


*