అమిత్ షా కు నిరసన సెగ

కర్నాటక ఎన్నికల ప్రచారం ముగియడంతో నేరుగా తిరుమలకు వచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా. ఆయన వచ్చారని తెలుసుకున్న టీడీపీ నేతలు నిరసనకు దిగారు. వాస్తవంగా తిరుమలలో ఎలాంటి నిరసనలు, ఆందోళనలు ఉండవు. కానీ ఏపీకి హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఆ తర్వాత ఆ సంగతిని పక్కన పెట్టింది. తిరుపతిలో 2014లో జరిగిన సభలో పాల్గొన్న మోడీ హోదా పై హామీనిచ్చారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. ధర్మపోరాట సభ పేరుతో తిరుపతిలో సభ పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మోడీ ఇచ్చిన హమీలను గుర్తు చేశారు. అసలు హోదా పై మోడీ ఏమన్నారు. ఏంటనే విషయాలను వీడియోల ద్వారా చూపించారు. ఫలితంగా బీజేపీ పేరు చెబితేనే ప్రజలు వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే టీడీపీ నేతలు, కార్యకర్తలు అమిత్ షా పై నిప్పులు చెరిగారు. 
ఒక దశలో అమిత్ షా కాన్వాయ్ పైకి రాళ్లు విసిరేందుకు ప్రయత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఏపీకి విభజన నిధులే కాదు..పోలవరం వంటి ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలున్నాయి. ఇలా తనకు నిరసన తెగ తగులుతుందని అమిత్ షా ఊహించలేదు. అందుకే హాడావుడిగా అక్కడ నుంచి వెళ్లిపోయారు. కర్నాటకలో బీజేపీని ఓడించాలని టీడీపీ పిలుపునిచ్చింది. ఇప్పుడు నిరసనలు తెలిపింది. ఫలితంగా అక్కడి తెలుగు వారు ఏం చేస్తారనేది ఉత్కంఠను పెంచుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*