కేసీఆర్ అంటే బాబు భ‌య‌ప‌డుతున్నాడ‌ట‌….

తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక రాజ‌కీయ ప‌రిస్థితులు కూడా మారాయి. స‌మీక‌ర‌ణ‌లు కూడా మారాయి. తెలంగాణ‌లో టీడీపీ దాదాపు క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఓటుకునోటు కేసుతో బాబును క‌ట్ట‌డి చేయ‌డంలో కేసీఆర్ స‌ఫ‌లీక్రుతుడ‌య్యాడు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. రెండు సంవ‌త్స‌రాల క్రితం రాజ‌కీయంగా హ‌ల్‌చ‌ల్ చేసిన నోటుకు ఓటుకేసు ఇప్పుడు మ‌రోసారి తెర‌మీదకువ‌చ్చింది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. బాబు మైత్రీ కుదిరాక ఈ కేసు గురించి ఎప్పుడు ప్ర‌స్థావించిన కేసీఆర్ రెండు రోజుల క్రితం అధికారుల‌తో స‌మావేశంలో కేసు ఎంత వ‌ర‌కు వ‌చ్చింద‌ని ఆరా తీసారు. ఆయ‌న ఓటుకు నోటు కేసుపై ద్రుష్టి సారించాడ‌ని బ‌య‌ట‌కు పొక్క‌డంతో రాజ‌కీయంగా రెండు రాష్ట్రాల్లో ప‌రిస్థ‌తి వేడెక్కింది. ప్రముఖ నటి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా  మాట్లాడుతూ  ఓటుకు నోటు కేసు విష‌యంలో బాబు భ‌య‌ప‌డుతున్నాడ‌ని కామెంట్ చేశారు. తెలంగాణ కేసీఆర్ స‌మావేశం పెట్ట‌గానే ఇక్క‌డ బాబులో వ‌ణుకు మొద‌లైంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు దర్యాప్తు ముమ్మరం అవుతుంది కాబట్టే ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని ఆరోపించారు.  దీనిపై ఎలా స్పందించాలో తెలియ‌క తెలుగు త‌మ్ముళ్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. 

1 Comment

  1. ఫోన్ టాపింగ్ మరింత పెద్ద కేసుగా మెడకు చుట్టుకొంటుందని తెలిసినా ఢిల్లీ పెద్దల అండ ఉంటే భయంలేదనే భరోసాతో దిలాసాగా ఉన్నారాయన . కానీ ఒకరిమీద ఒకరిని ఉసికొలిపి చోద్యం చూస్తూ తెలుగునాయకులిద్దరినీ
    అదుపుచేయడానికి ఢిల్లీపెద్దలు పావులు కదుపుతున్నారని గుర్తు పెట్టుకొంటే మంచిది.

Leave a Reply

Your email address will not be published.


*