అమెరికాలోమహానాడు సన్నాహక సమావేశం

ఎన్నారై  తెలుగుదేశం డల్లాస్ విభాగం ఆద్వర్యం లో  ది 06/05/2018 ఆదివారం సాయంత్రం ప్లానోలో గల తబలా ఇండియన్  రెస్టారెంట్ లో మహానాడు సన్నాహక  సమావేశాన్ని నిర్వహించారు. డల్లాస్ నగరములో  మొదటిసారిగా నందమూరి తారకరామారావు 95వ జన్మదినాన్ని పురస్కరించుకొని , అమెరికాలో  భారీగా మహానాడు చెయ్యాలి అని నిర్ణయించారు.  పదిహేను సంవత్సరాలుగా  అమెరికాలోని  పలు నగరాల్లో మహానాడులు చేయ్యటం ఆనవాయితీగా వస్తుంది.  ఈ సారి జాతీయ స్థాయిలో తెలుగుదేశం శ్రేణులందరూ కలసి  డల్లాస్  పట్టణములో భారీగా చెయ్యాలని,  ఈ కార్యక్రమానికి అన్ని నగరాలనుంచి ఆహుతులను పిలవాలని నిర్ణయించారు.  ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి కూడా రాష్ట్ర స్థాయి నాయకులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి అని నిర్ణయించారు. 

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కష్టాల నుంచి చంద్రబాబు గారి నాయకత్వములో సమర్ధవంతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రయతిన్స్తున్న తరుణములో, అమెరికా నుంచి కూడా చంద్రబాబుకి తోడుగా  అయన  చూపెట్టే అన్నికార్యక్రమాలకు మద్దతు తెలపాలి అని నిర్ణయించారు.  మహానాడు కార్యక్రమాన్ని మే 27 , మే  28 తారీకుల్లో డల్లాస్ లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా చేసేందుకు వీలుగా మొదటి ప్లానింగ్ మీటింగ్ ఇవ్వాళా జరిగింది.  ఈ కార్యక్రమం లో పలు కమిటీలను  వేసుకొని, డల్లాస్ లో ఉన్న తెలుగు దేశం అభిమానులు, ఆస్టిన్, హౌస్టన్ లో ఉన్న తెలుగుదేశం అభిమానులను అనుసంధానం చేసుకుంటూ ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరు అయ్యేట్టు ప్రయత్నించాలి అని నిర్ణయించారు.

ఈ మీటింగ్ కు, శ్రీని మండవ, సుగున్ చాగర్లమూడి, కేసి చేకూరి, అనిల్ వీరపనేని, శ్రీనివాసరావు  కొమ్మినేని, అజయ్ గోవాడ, వేణు పావులూరి, శ్రీనివాస్ శాఖమూరి, నవీన్ ఎర్రమనేని, సతీష్ కొమ్మన, కిశోరె చలసాని, కిరణ్ తుమ్మల,  లోకేష్ నాయుడు, జనార్దన్ ఏనిగిపాటి, సాంబ దొడ్డ,  సుధాకర్ కంచర్ల, ప్రవీణ్ కోడలి, వెంకట్  తొట్టెంపూడి  తుదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*