విజయ సాయి రెడ్డి సడెన్ గా సైలెంట్ అయ్యాడు, దేనికో తెలుసా?

విజయ సాయి రెడ్డి సడెన్ గా సైలెంట్ అయ్యాడు, దేనికో తెలుసా? మాస్టర్ ప్లాన్ పూర్తీ వివరాలు

జగన్ పార్టి లో నంబర్ 2 ఎవరు అంటే ఇప్పుడు వెంటనే వచ్చే సమాధానం విజయ సాయి రెడ్డి. మరి అలాంటి విజయ సాయి రెడ్డి మొన్నటి వరకు ఢిల్లీ లో PMO చుట్టూ కనపడేవాడు. ఇప్పుడు సడెన్ గా మాయం అయ్యాడు. దాదాపు రెండు మూడు వారాలకు పైగా సైలెంట్ గా ఉన్నాడు. విజయ డై రెడ్డి ఎక్కడ ఉన్నాడా అని ఆరా తీస్తే కొన్ని సంచలన నిజాలు తెలిసాయి. విజయ సాయి రెడ్డి ప్రస్తుతం బెంగళూరు లోని ఒక ప్రముఖ స్టార్ హోటల్ లో ఉంటున్నారు. ఆ హోటల్ గది నుంచి విజయ సాయి రెడ్డి ఒక మిషన్ పై పని చేస్తున్నారు, ఈ మిషన్ బాధ్యత అప్పచెప్పింది కూడా అమిత్ షా అనే వార్తలు వస్తున్నాయి. సాక్షాత్తు అమిత్ షా-

టాస్క్ ఇవ్వటంతో, అన్ని పనులు పక్కన పెట్టి మరీ విజయసాయి రెడ్డి ఆ పనిలో పడ్డారు. దీనికి జగన్ కూడా ఫుల్ పర్మిషన్ ఇచ్చినట్టు తెలిసింది. మాట రానియ్యకుండా, అమిత్ షా చేసిన పని సమర్ధవంతంగా నిర్వహించాలని, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యద్దు అని, ఎలా అయినా సరే, విజయంతో తిరిగి రావాలని, అవసరం అయితే, ఏమి కావాలంటే అది తీస్కోమని ,ఫైనల్ గా అమిత్ షా సంతృప్తి చెందాలని, జగన్, విజయసాయి రెడ్డికి చెప్పి పంపించారు.ఇంతకీ, విజయసాయి రెడ్డికి ఇచ్చిన బాధ్యత ఏంటి అనుకుంటున్నారా ? బీజేపీ పార్టీ తరుపున కర్ణాటక ఎన్నికల బాధ్యత… కర్ణాటక ఎన్నికల్లో, పని చెయ్యటానికి, విజయసాయి రెడ్డికి కొన్ని నియోజకవర్గాల బాధ్యత ఇచ్చినట్టు తెలుస్తుంది.. ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్న విజయసాయి రెడ్డి, గత కొంత కాలంగా సైలెంట్ అయిపోయారు.. అక్కడ కావాల్సిన ఆర్ధిక వనరులు, మనుషలని పంపించటంలో బిజీగా ఉన్నారు.. కడప, అనంతపురం నుంచి, ఇప్పటికే కొన్ని వేల మంది వైసిపీ కార్యకర్తలని, కర్ణాటక పంపించారు.. అక్కడ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం, చీకటి పడిన తరువాత, ఎన్నికల సమయంలో చేసే పనులు, వీళ్ళ బాధ్యత… అలాగే, ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి వ్యతిరేక ప్రచారం చేసే ఎవరైనా వస్తే, వారిని అడ్డుకోవటం కూడా వీరి బాధ్యత…పక్క రాష్ట్రము నుంచి, ఇక్కడకు వచ్చి,అలజడి రేపే ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలిసింది…

ఇక్కడ వింత ఏంటి అంటే, వైసిపీ ఇంత బహిరంగంగా, కర్ణాటకలో బీజేపీ కోసం పని చేస్తూ, కాంగ్రెస్ ను ఓడించే ప్రయత్నం చేస్తుంటే, మన రాష్ట్రంలో ఉన్న ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా, వైసిపీ నేతలను తప్పు పట్టం లేదు. మొత్తానికి, అమిత్ షా ని ప్రసన్నం చేసుకోవటాని, విజయసాయి రెడ్డి, కర్ణాటకలో బిజీగా ఉన్నారు… మరి, ఫలితం ఎలా ఉంటుందో, కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది…

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*