సుజనా పార్టీ మారతారనే ప్రచారం 

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పార్టీ మారతారనే ప్రచారం తొలిగా ఎవరు చేశారో తెలియదు. కానీ సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీడీపీని వీడి బీజేపీకి ఆయన వెళతారనేది సారాంశం. టీడీపీ ఎంపీ ప్రధాని మోడీ నివాసం వద్దకు వెళ్లి ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. అసలు మోడీ నివాసం రాకముందే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో సుజనాను వారు అదుపులోకి తీసుకోలేదు. ఆయన నేరుగా మోడీ నివాసానికి వెళ్లారనే వాదన వచ్చింది. అంతే కాదు.. మోడీ టీమ్ తో సుజనా చౌదరికి సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ సిఎం చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇప్పించడంలో అలానే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు.. విభజన హామీలను నెరవేర్చేలా చేయడంలో సుజనా సక్సెస్ కాలేదనే చెప్పాలి. అంతగా పరిచయాలు ఉంటే ఏపీకి న్యాయం చేసేలా చూడాలి. ఆపని చేయలేదనే అసంతృప్తి సిఎం చంద్రబాబులో ఉంది. అదే విషయాన్ని ప్రస్తావించారంటారు. టీడీపీలో చంద్రబాబు కంటే సుజనాతోనే ఎక్కువగా మాట్లాడేందుకు బీజేపీ నేతలు ఆసక్తి చూపేవారు. ఫలితంగా సుజనా ఇటు టీడీపీ, అటు బీజేపీకి వారధిలా కనిపించారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలిగింది. అయినా సరే తన పాత సంబంధాలను సుజనా చౌదరి కొనసాగిస్తున్నారు. 
అందుకే టీడీపీ ఎంపీలు కొందరికీ సుజనా మీద అనుమానం వచ్చిందట. అదే విషయంపై మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారనే ప్రచారం సాగుతోంది. సిబిఎన్ వాట్సాప్ లో ఇందుకు సంబంధించిన వార్త ఒకటి వచ్చిందట. దానికి లోకేష్ బదులిస్తూ.. వేచి చూద్దాం అనే కామెంట్ పెట్టారట. ఇది పుకారో నిజమో తెలియదు. కానీ ప్రచారం మాత్రం పీక్ స్టేజ్ లో వెళ్లింది. ఇదంతా బీజేపీ మైండ్ గేమ్ అని అంటున్నారు సుజనా. తాను బీజేపీలో చేరతానన్నవి వదంతులు. అరుణ్ జైట్లితో తనకు గతం నుంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోడీ కనిపిస్తే నమస్కారం చేయడం సంస్కారం అని, తాను సభలోనే ప్రధానిని కలిశానని చెప్పారు. మోడీ క్యాబినెట్ లో మంత్రిని అయినా తమ నేత చంద్రబాబునే అన్నారు సుజనా. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*