తప్పులో కాలేసిన ఉప్పులేటి కల్పన

ఉప్పలేటి కల్పన. పామర్రు ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. బీటెక్ చదివిన ఆమె రాజకీయాల్లోకి చేరి ప్రజాసేవలందిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను పార్టీ మారుతున్నట్లు ప్రస్తావించారు. కానీ ఆమె టీడీపీలో చేరడం ఏమోగానీ ఆమె పేరుతో వచ్చిన బ్యానర్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని టీడీపీ, బీజేపీ తప్ప అన్ని పార్టీలు కోరుకున్నాయి. నాలుగేళ్ల తర్వాత టీడీపీ హోదా కావాలంటోంది. కానీ పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తప్పులో కాలేస్తోంది. ప్రత్యేక హోదా సాధనకు నిరసనగా సైకిల్ ర్యాలీ చేస్తున్నట్లు బ్యానర్లు ఏర్పాటు చేసారు. ఒకటి కాదు రెండు కాదు.. వేల బ్యానర్లు ఇలా వెలవడంతో బిత్తర పోవడం టీడీపీ క్యాడర్ వంతు అయింది. జీపులకు వెనుక కట్టి మరీ హోదా వద్దని ప్రచారం చేస్తున్న తీరు ఆశ్చర్యమే. ప్రత్యేక హోదా వద్దని గతంలో చెప్పారు చంద్రబాబు. ఇప్పుడు కావాలంటున్నారు. అలాంటి సమయంలో హోదా వద్దని సైకిల్ ర్యాలీ చేయడం బాగుండదంటున్నారు. 
ఆలస్యంగా అసలు సంగతి తెలుసుకుంది ఉప్పులేటి కల్పన. పొరపాటు జరిగింది. హోదా కావాలనేది టీడీపీ ఆలోచన. అందుకే హోదా సాధనకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం కాదు. హోదా కోసం ఆందోళన చేస్తామంటున్నారు. సైకిల్ ర్యాలీ చేసేది హోదా కోసం అంటూ తప్పు సరిజేసారు. మీడియాకు అలాంటి ఫొటోలు అందింతే ఇక ఆగుతాయా.. అందులోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫలితంగా అంతా తిడుతున్నారు. హోదా ఇవ్వని బీజేపీని తిడుతున్నట్లే ఉప్పులేటి కల్పనకు ఏం పుట్టింది. ఇలా చేస్తుంది అంటున్నారు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*