రాజస్థాన్ రాయల్స్ కు ఎంపికైన తెలుగు క్రికెటర్ కార్తీక్ సాగర్

ఐపిఎల్ తొలి విజేత రాజస్థాన్ రాయల్స్. 2008లో జరిగిన పైనల్ లో చైన్నై సూపర్  కింక్స్ ను ఓడించి తన తడాఖా చూపింది. అలాంటి జట్టుకు ఐపిఎల్-11 సీజన్ కు ఎంపికయ్యారు తెలుగువాడైన కార్తీక్ సాగర్ గట్టిపల్లి. అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ కు చెందిన కార్తీక్ అండర్-19 అమెరికా క్రికెట్ జట్టులో సభ్యుడు. 17 ఏళ్లలోపే తన సత్తా చాటి అందరి అభినందలు అందుకున్నాడు. తెలుగువారి ఘనతను విదేశాల్లోను చాటి చెబుతున్నాడు. ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ గైర్హాజరీతో కెప్టెన్ పగ్గాలు చేపట్టిన రహానేకు అండగా నిలవనున్నాడు కార్తీక్ సాగర్. ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 క్రికెట్ మ్యాచ్ లో అమెరికా పక్షాన ఆడి తన సామర్థ్యాన్ని చాటాడు. ఎడమచేతి వాటం ఆటగాడు. బౌలింగ్ లోను మంచి ప్రతిభ ఉంది. ఆల్ రౌండర్. రాబోయే కాలంలో ఆయన సేవలను  రాజస్థాన్ రాయల్స్ వినియోగించుకోనుంది. తెలుగు వాడు. అందులోను డల్లాస్ కు చెందిన క్రికెటర్ కావడంతో ఎన్నారైలంతా ఆయనకు అభినందనలు తెలిపారు.  
మరోవైపు సాగర్ గట్టేపల్లి, అపర్ణ గట్టేపల్లికి అభినందనలు తెలిపారు విశ్వకర్మ కుటుంబ సభ్యులు. సాగర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఎంపిక కావడం తమకు గర్వకారణంగా ఉందని చెప్పారు విశ్వకర్మ కుటుంబ సభ్యులు. 
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ లు అంటే సాగర్ కు ఎంతో అభిమానం. వారిని స్ఫూర్తిగా తీసుకుని తాను క్రికెట్ ఆడుతానని పలు సందర్భాల్లో కార్తీక్ సాగర్ చెప్పారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగిం చేసుకుంటానని. తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని చెబుతున్నారు. ఐపిఎల్ లో మరో తెలుగోడి సత్తా చాటాలని ఆకాంక్షిస్తున్నాం.
తెలంగాణలోని హనుమకొండకు చెందిన కార్తీక్ భవిష్యత్ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటోంది నమస్తే ఆంధ్రా.
ఆల్ ది బెస్ట్ కార్తీక్.

2 Comments

Leave a Reply

Your email address will not be published.


*