అమెరికా లోని ఛార్లెట్ లో ధర్మ పోరాట దీక్ష

కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అన్యాయానికి నిరసనగా, చంద్రబాబు నాయుడు గారి ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా చార్లెట్ నగరంలోని ప్రవాసాంధ్రులు శుక్రవారం నాడు ఉపవాస దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రవాస వ్యవహారాల మంత్రి కొల్లు రవీంద్ర, పెనమలూరు శాసనసభ్యుడు బోడె ప్రసాద్, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి తదితరులు వీడియో కాంఫరెన్స్‌లో ప్రవాసులతో ముచ్చటించి ధర్మపోరాట దీక్ష చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ దీక్షలో ప్రవాసులు శ్రీనివాస్ చందు గొర్రెపాటి, ఠాగోర్ మల్లినేని, నితిన్ కిలారు, నాగమల్లేశ్వరావు పంచుమర్తి, సాయి కావూరి, రామ పాలడుగు, శశి సుంకర తదితరులు పాల్గొన్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*