ధర్మ పోరాట దీక్షకు సంఘీ భావం తెలియ చేసిన కువైట్ ప్రవాసాంధ్ర తెలుగు దేశం

ప్రత్యేక హోదా కోసం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ నీతికి వ్యతిరేకంగా, రాష్త్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్ర బాబు నాయుడు గారు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు సంఘీ భావం తెలియ చేసిన ప్రవాసాంధ్ర తెలుగు దేశం, APNRT, యాదవ సేవా సంఘం మరియు MRPS.

ఓమరియా పార్కులో ఉదయం 11 గంటల నుండి 4 గంటల వరకు చంద్రన్న దీక్షకు మద్దతుగా APNRT ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టటం జరిగింగింది. తదనంతరం యాదవ సేవా సంఘం ఆధ్వర్యము రాయలసీమ హోటల్ లో చంద్రన్న జన్మదినోత్సవ వేడుకులతో పాటు తి తి దేవస్థానం చైర్మన్ గా నియమించబడిన శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి అభినందన సభ ఏర్పాటు చేయటమైనది.

ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ కేంద్రం మొండి వైఖరి విడనాడి తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమం లో వెంకట్ కోడూరి. దివాకర్ ఓలేటి. మహమ్మద్ బొర్రా, రాము యాదవ్,మాలేపాటి. బాబు, రవి, వెంకట్ కొర్రపాటి, మురళి, సుదర్శన్ నాయుడు,,మేడమలి శ్రీను, రామకృష్ణ యాదవ్, వెంకట సుబ్బయ్య, చంద్ర మౌళి,మాచినేని శ్రీనివాస్,వెంకటేష్ బావికాడపల్లి, షేక్ బాషా , మల్లి మరాతు తదితరులు పాల్గొన్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*