పోతున్న పవన్ కల్యాణ్ పరువు

శ్రీరెడ్డి పేరు చెబితేనే మెగా కాంపౌండ్ వణికిపోతోంది. అంతగా వారిని ప్రభావితం చేస్తోంది. వారే కాదు..చాలా మంది అధికారులు, నేతలు, సినీ ప్రముఖులకు కంటి నిండా నిద్ర కరువుతోంది. ఎప్పుడు తమ పేర్లు బయట పెడుతుందా..ఆడియో, వీడియోలు వెల్లడిస్తుందో అర్థం కాక తలలు బాదుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ మీద ఆమె దాడి మొదలైంది. మొన్న శృతి అనే నటి పవన్ కల్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడింది. బెంగాళీ అమ్మాయిలు అతనికి కావాలట. మసాజ్ పేరుతో ఏం చేస్తాడో తెలియంది. ఫలితంగా పవన్ కల్యాణ్ పరువు బజారున పడింది. ఇప్పుడు శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి అదే పనిచేస్తోంది. అసలు పవన్ ను అన్నయ్య అని పిలిచినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలంది. అనడమే కాదు.. చెప్పుతో కొట్టుకోవడంతో ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేగుతోంది. 
మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్‌కు అమ్మాయిల బాధలేం తెలుస్తాయని ప్రశ్నించింది. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి. ప్రచారం కోసం మీడియాకెక్కితే లాభం లేదన్న పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి నిప్పులు చెరిగింది. పవన్ కళ్యాణ్.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నావ్.. అసలు నీకు మహిళలంటే గౌరవం ఉందా? అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌లకు వెళ్లాలా? నువ్ చెప్పాలా అని శ్రీరెడ్డి కడిగిపారేసింది. ఇకపై ఎవరూ పవన్‌ని అన్నా అని పిలవొద్దని,  ఓట్లు వేయొద్దని మహిళలను కోరింది. అంతే ఆ విషయం అంతటా వ్యాపించింది.
మహిళలంటే గౌరవం లేని పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేస్తాడని శ్రీరెడ్డి అడగడంతో విస్తుబోవడం మెగా ఫ్యామిలీ వంతు అయింది. మీ ఫ్యాన్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పవన్ కళ్యాణ్‌ను హెచ్చరించింది శ్రీరెడ్డి. హీరోల ఫ్యాన్స్‌ బెదిరింపులకు దిగొద్దని చెప్పింది. మరోవైపు శ్రీరెడ్డి వ్యాఖ్యలు బాధించాయని ప్రముఖ నటుడు సంపూర్ణేష్ బాబు అంటున్నారు. జనసేన అధినేత పవన్‌ను ఆయన తల్లిని నిందించటం మనసుకు బాధగా ఉందన్నారు. ‘పవన్ కల్యాణ్‌ని తిట్టాలనే దురుద్దేశంలో ఆమె ఒక తల్లిని తిట్టిందని సభ్యసమాజం అర్థం చేసుకోవాలి. అంత అసభ్య భాష, సాధారణ స్త్రీలు కనీసం వినడానికి కూడా సంకోచించే భాషలో మాతృమూర్తిని విమర్శించటం మంచిది కాదని చెప్పింది. 
కత్తి మహేష్ విషయంలో ఫ్యాన్స్ చేసిన హంగామాతో పవన్ కల్యాణ్ పరువు పోయింది. ఇప్పుడు శ్రీరెడ్డి విషయంలో ఫ్యాన్స్ జోక్యం చేసుకోవడంతో రగడ రేగే అవకాశముంది. రాజకీయాల్లో అపరిచితుడులా వ్యవహరించే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను కట్టడి చేయకపోతే ఇబ్బంది పడక తప్పదు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*