విజయశాంతి గెలిచిన సీట్లో ప్రకాష్ రాజ్

మెదక్ ఎంపీగా పని చేశారు రాములమ్మ. అక్కడ నుంచే ఎంపీగా గెలిచారు. పార్లమెంటుకు వెళ్లారు. ఆ తర్వాత పోటీ చేసినా ఓడిపోయారు. ఇప్పుడా సీటును ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు ఇచ్చేందుకు సిద్దమైంది టీఆర్ఎస్. అందుకే అతనికి కీలక బాధ్యతలు అప్పగించనుంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న కేసీఆర్. ఆయనకు కో-ఆర్డినేటర్ పదవిని అప్పగించనుందట. ప్రకాష్ రాజ్ ఆ పదవి తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారట. రాజకీయాలపై ప్రకాష్ రాజ్ బాగానే స్పందిస్తుంటారు. గౌరీ లంకేష్ ను చంపేసినప్పుడు బీజేపీ తీరును గట్టిగానే తప్పు పట్టారు. కాంగ్రెస్ నేతల వైఖరిని ఎండగట్టారు. ఇప్పుడు బీజేపీపై మాటల తూటాలు పేల్చుతున్నాడు ప్రకాష్ రాజ్. తమిళం, కన్నడం, మళయాళం, తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు ప్రకాష్ రాజ్. బాలీవుడ్ లోను చాలా సినిమాల్లో నటించాడు. అందుకే ఆయన్ను తమ పార్టీ అవసరాల కోసం వినియోగించుకోనుంది టీఆర్ఎస్ 
దక్షిణాది రాష్ట్రాల్లోనూ పేరు ప్రఖ్యాతులున్న ప్రకాష్ రాజ్ ను దగ్గరకు తీశారు కేసీఆర్. మాజీ ప్రధాని దేవెగౌడ తో భేటీ మొదలుగొని.. చర్చలు ముగిసే వరకు ప్రకాష్ రాజ్ నే గులాబీ నేతకు అండగా నిలిచారు. ఇప్పుడు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి తనయుడు స్టాలిన్‌తోనూ ఆయనకు స్నేహపూర్వక సంబంధాలున్నాయి. కేసీఆర్ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తున్న ప్రకాష్ రాజ్.. కరుణానిధితో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఉద్దేశాలను స్టాలిన్‌కు వివరించి ఆయన్ను ఒప్పించారంటున్నారు. వచ్చేనెలలో కేసీఆర్, కరుణ భేటీ ఉంటోందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
తనకు పని చేస్తున్న ప్రకాశ్ రాజ్ ను ఎంపీని చేయాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారట. అందుకే మెదక్ నుంచి ఆయన్ను బరిలోకి దింపనున్నట్లు సమాచారం. కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన వారు ప్రకాష్ రాజ్. తెలుగు బాగానే మాట్లాడతారు. గతంలో విజయశాంతిని గెలిపించిన ప్రజలు ఈ సారి ప్రకాష్ రాజ్ విషయంలో ఏం చేస్తారో చూడాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*