యువ ఎంపీ మెరుపు దీక్ష

పిడుగుల్లేని వాన అంటారు చూడు. అలా ఉంది శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు దీక్ష. మెరుపు వేగంతో రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నారు. కూర్చున్నాడు. కేంద్రాన్ని నిలదీస్తున్నాడు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లా ఉంటోంది రామ్మోహనాయుడు వ్యవహార శైలి. ఆంగ్లంలో మంచి పట్టుంది. గట్టిగా మాట్లాడగలడు. ఐక్యరాజ్యసమితి సమావేశంలోనే ఇరగదీశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏపీకి జరుగుతున్న అన్యాయంపై దీక్ష చేశాడు. ఏపీకి హోదాతో పాటు రైల్వేజోన్‌ ఆంధ్రుల హక్కుని చెప్పారు. పక్క రాష్ట్రం ఒడిశా అభ్యంతరం చెప్పకపోయినా రైల్వేజోన్‌కు కేంద్రం మోకాలడ్డుతోందని ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పి… ఈశాన్య రాష్ట్రాలకు రాయితీలు ఇచ్చింది కేంద్రం. ఆ సంగతిని గుర్తు చేశారాయన. 
ఏపీ విషయంలో బీజేపీ రాజకీయ డ్రామా ఆడుతోందని ఎంపీ రామ్మోహన్‌నాయుడు తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆముదాలవలస రైల్వేస్టేషన్‌లో ఎంపీ దీక్ష చేపట్టడంతో నేతలంతా అక్కడకు వెళ్లారు. ఎంపీ తీరును ప్రశంసించారు. ఎవరికి వారే నేతలంతా దీక్షలు, ర్యాలీలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. బంద్ లు చేస్తున్నారు. ఫలితంగా కేంద్రంలో కదలిక వస్తోంది. ఇంకోవైపు కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేయడంతో కీలక పరిణామాలు మారనున్నాయని తెలుస్తోంది. కేంద్రంపై ఒత్తిడితెచ్చే ప్రక్రియ మరింత ముమ్మరమైంది. ఈనెల 20న చంద్రబాబు దీక్షకు దిగనుండటం, ముందురోజు స్పీకర్ సైకిల్ యాత్రలు చేయడం, ప్రతి నియోజకవర్గంలో యాత్రలు, దీక్షలతో హోరెత్తించనుండటం హాట్ టాపిక్ గా మారింది. 
బీజేపీ నేతల ఆరా…
ఏపీలో జరుగుతున్న సంగతులపై ఆరా తీసేందుకు గుజరాత్, రాజస్థాన్, ఏపీకి చెందిన కొందరు మాజీ అధికారులను నియమించింది కేంద్రం. సిఎం చంద్రబాబుతో పాటు.. నేతలు ఏం చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటని రోజు ఆరా తీస్తున్నారు. కేంద్రం ఇంటిలిజెన్స్ విభాగం ఆ పని చేస్తున్నా.. వారికి సంబంధం లేకుండా మరింత సమాచారం సేకరిస్తున్నారు కొందరు. ఇంకోవైపు గవర్నర్ నరసింహన్ తోను తెప్పించుకున్న నివేదికలను చూసి కార్యాచరణ రూపొందిస్తోంది కేంద్రం. వీలున్నంత తొందరలో చంద్రబాబుకు సంబంధించిన కేసులను తిరగదోడతారని తెలుస్తోంది. అవి బయటకు వస్తే చంద్రబాబుకు ఇబ్బంది అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*