కంభంపాటి అందుకే రాజీనామా చేశారట…

ఏపీ బీజేపీ పని అయిపోతోంది. ఏం చేయాలో అర్థం కాక కమలం పెద్దలు జుట్టు పీక్కుంటున్నారు. పుండు మీద కారం చల్లినట్లు ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. 2014 నుంచి ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన వల్ల బీజేపీకి నష్టం కంటే లాభం జరగలేదంటారు. రాష్ట్ర విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా కంభంపాటి అంటే బీజేపీలోనే చాలా మంది తిట్టుకుంటున్నారు. బాహాటంగానే ఆయన తీరును తప్పు పట్టారు విజయవాడలో జరిగిన సభలో. అంతగా పార్టీలో ప్రాధాన్యత కోల్పోయాడు. అదే సమయంలో వెంకయ్యనాయుడు శిష్యుడిగా ముద్ర పడ్డారు. వెంకయ్యనే పక్కన పెట్టినప్పుడు ఆయన శిష్యుడు ఒక లెక్క అనుకుంది హైకమాండ్. అందుకే ఆయన్ను తొలగించి మరొకరిని ఆ స్థానంలో కూర్చో పెట్టేందుకు ఆలోచిస్తోంది. అందుకే ఆయనతో రాజీనామా చేయించారంటున్నారు. మరోవైపు ఏపీకి హోదా ఇవ్వకుండా ప్రజల దృష్టిలో దోషిగా నిలబడింది బీజేపీ. ఫలితంగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అందుకే పార్టీ పదవికి రాజీనామా చేశారనే వాదన లేకపోలేదు. 
కొద్ది రోజుల కిందటే ఆయన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం వచ్చింది. ఆయన స్థానంలో తొలిగా మాణిక్యాలరావు, ఆ తర్వాత సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయినా ఎవరినీ ప్రకటించలేదు. కేంద్ర మంత్రి పదవిలోకి హరిబాబును తీసుకునేందుకు రాజీనామా చేయించారనే వాదన ఒకవైపు చేస్తుండగా.. బీజేపీ తీరుతోనే ఆయన మనస్థాపం చెంది పదవిని వదులుకున్నాడని మరికొందరు అంటున్నారు. మొత్తంగా ఇంటి పోరులో వాస్తవం ఏంటనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. కంభంపాటి స్థానంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను తీసువస్తున్నారని.. ఆయన వస్తే బీజేపీలో పుల్ జోష్ ఉంటుందనే వాదన లేకపోలేదు. మొత్తంగా బీజేపీలో మారిన సమీకరణలు హాట్ టాపికయ్యాయి. టీడీపీతో పాటు.. మిగతా పక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు బదులిచ్చే దమ్ము లేకుండా పోయింది కంభంపాటికి. అందుకే తాను ఏం చేయలేక రాజీనామా చేశారనే చర్చ సాగుతోంది.  
 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*